కరోనా మహమ్మారి మళ్ళీ ఒళ్ళు విరుచుకుంటోంది. తగ్గింది అనుకునేలోపే ఉగ్రరూపం చూపిస్తోంది ప్రతి ఏడాది. ఈ ఏడాది థర్డ్ వేవ్ మొదలైనట్టుంది. నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి. సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఫారిన్ ట్రిప్ తరువాత కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు సమంత సైతం కడప ట్రిప్ అనంతరం జలుబు రావడంతో ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుంది. ఆమె అభిమానుల ఆందోళన ఇంకా తగ్గక ముందే…
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన మార్క్ చూపిస్తున్నారు స్టాలిన్.. కొన్ని సందర్భాల్లో అందరినీ ఆయన నిర్ణయాలు ఆశ్చర్యంలో ముంచేసిన సందర్భాలు లేకపోలేదు.. ఇక, ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు స్టాలిన్… రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారికి సహాయం అందించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. ఇవాళ దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.. కరోనాబారినపడి చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 50 వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.. కాగా, ఇప్పటి వరకు తమిళనాడులో కరోనాతో…
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఓ షోలో పాల్గొనడంపై ఫైర్ అవుతూ నోటీసులు జారీ చేసింది. కమల్ హాసన్ కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ స్వయంగా తనకు కోవిడ్ -19 సోకింది అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. యూఎస్…
తెలుగు చిత్రసీమను ఏలిన నృత్య దర్శకుల్లో శివశంకర్ మాస్టర్ శైలి విభిన్నం! శాస్త్రీయ రీతుల్లోనూ, జానపద బాణీల్లోనూ నృత్యభంగిమలు కూర్చి ప్రేక్షకులను రంజింప చేయడంలో మేటిగా నిలిచారు శివశంకర్. ఆయనకు సింగిల్ కార్డులు తక్కువేమీ కాకున్నా, సింగిల్ సాంగ్స్ తోనే పలు మార్లు భళా అనిపించారు. తెలుగునాట శివశంకర్ శిష్యప్రశిష్యులు ఎందరో రాజ్యమేలుతున్నారు. వారితోనూ పోటీపడి నర్తనంలో భళా అనిపించారు మాస్టర్. భావి నృత్యకళాకారులకు శివశంకర్ మాస్టర్ దిశానిర్దేశం చేస్తూ పలు సలహాలు, సూచనలతో అనేక కార్యక్రమాల్లో…
కోవిడ్-19 సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆదివారం (నవంబర్ 28) రాత్రి తుది శ్వాస విడిచారు. శివశంకర్ మాస్టరు చనిపోయే ముందు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు శివ శంకర్ చికిత్స పొందుతున్న ఏఐజీ హాస్పిటల్స్ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సీనియర్ కొరియోగ్రాఫర్, నటుడి పార్థివ దేహాన్నిఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు చివరి నివాళులర్పించేందుకు హైదరాబాద్, మణికొండలోని పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి తీసుకెళ్లనున్నారు. శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం…
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ యుఎస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19 కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అక్కడ ఆయన వైరస్ బారిన పడ్డాడని అంటున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ వారం ప్రారంభంలో చెన్నైకి తిరిగి వచ్చిన తర్వాత కమల్‌కు దగ్గు రావడం ప్రారంభమైంది. దీంతో వైద్యుల సలహా మేరకు కోవిడ్ టెస్ట్…
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా పరిస్థితి సీరియస్ అవ్వడంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ గత నాలుగు రోజులుగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకడంతో మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ రోజురోజుకూ శివ శంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమవుతోంది. ఆయన వైద్యానికి రోజుకు లక్షల…
కోవిడ్-19 కారణంగా కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. నిన్న ఇటీవల ఆయన యూఎస్ ట్రిప్ ముగించుకుని వచ్చారు. ఆ సమయంలోనే దగ్గు రాగా, కమల్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్లి, వైద్యుల సూచనతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమల్ అభిమానులకు స్వయంగా తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న సాయంత్రం ఆయన కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కమల్…
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది.. ఫస్ట్, సెకండ్ వేవ్‌లే కాకుండా.. మళ్లీ కొన్ని దేశాలు ఇప్పుడు కొత్త వేరింయట్ కలకలం సృష్టిస్తోంది.. ఇదే సమయంలో డ్రాగన్ కంట్రీలోనూ మళ్లీ పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి.. దీంతో.. కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. లాక్‌డౌన్‌కు కూడా వెళ్తున్నారు. ఇక, చైనాలో హెర్డ్ ఇమ్యూనిటీపై అంచనాలు వేస్తున్నారు ఆ దేశ శాస్త్రవేత్తలు.. తాజాగా, చైనా శాస్త్రవేత్త, పల్మనాలజీ నిపుణుడు జాంగ్ నాన్‌షాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. చైనాలో 2022 తొలి…
రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. మరణాల రేటు కూడా పెరిగింది. దాంతో అలర్ట్ అయిన రష్యా ప్రభుత్వం… కఠిన ఆంక్షలు విధించింది. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న మాస్కో సహా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దాంతో స్కూళ్లు మూతపడ్డాయి. అత్యవసర, నిత్యవసరాలకు మినహాయింపు ఇచ్చారు. అయితే, పాక్షిక లాక్‌డౌన్ కూడా పూర్తిగా అమలు కావడం లేదు. మెట్రోలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టుపై ఎలాంటి ఆంక్షలు లేవు. దాంతో…