రష్యాలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. మరణాల రేటు కూడా పెరిగింది. దాంతో అలర్ట్ అయిన రష్యా ప్రభుత్వం… కఠిన ఆంక్షలు విధించింది. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న మాస్కో సహా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దాంతో స్కూళ్లు మూతపడ్డాయి. అత్యవసర, నిత్యవసరాలకు మినహాయింపు ఇచ్చారు. అయితే, పాక్షిక లాక్‌డౌన్ కూడా పూర్తిగా అమలు కావడం లేదు. మెట్రోలాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపై ఎలాంటి ఆంక్షలు లేవు. దాంతో మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రోడ్లపై కార్లు యథావిధిగా తిరుగుతున్నాయి. హోటళ్లు టేక్ అవేకు అనుమతివ్వడంతో… జనం క్యూకడుతున్నారు. అయితే మున్ముందు సంపూర్ణ లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందన్న వార్తలతో… నిత్యవసరాల కోసం జనం రోడ్లపైకి వస్తున్నారు. మాంసం షాపుల వద్ద రద్దీ పెరిగింది. పరిస్థితి చూస్తుంటే లాక్‌డౌన్ అమలవుతున్నట్లు కన్పించడం లేదని చెబుతున్నారు స్థానికులు.
ఇటు వ్యాక్సినేషన్ కూడా నెమ్మదిగా సాగుతోంది. స్పుత్నిక్‌పై రష్యా ప్రజల్లో అనుమానాలు ఇంకా పోలేదు. ఆ దేశ జనాభాలో 32శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఐతే వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతుండటం వల్లే కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 40వేలకు పైగా ఉంది. ప్రతిరోజు కరోనా వైరస్‌తో వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు. నవంబర్ 9 వరకు పాక్షిక లాక్‌డౌన్ కొనసాగనుంది. పరిస్థితి ఇలానే ఉంటే… సంపూర్ణ లాక్‌డౌన్ విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటోంది రష్యా మీడియా.
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!