భర్తీలోనూ వ్యాక్సినేషన్ రూల్స్.. నో వ్యాక్సిన్.. నో రిక్రూట్‌మెంట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండగా.. వ్యాక్సినేషన్‌తో చెక్ పెట్టేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. ఇప్పటికే నో వ్యాక్సిన్.. నో ఎంట్రీ..! నో వ్యాక్సిన్.. నో సాలరీ..! నో వ్యాక్సిన్.. నో జర్నీ..! లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి ఆయా సంస్థలు.. ఉద్యోగి మాత్రమే కాదు.. అతని కుటుంబసభ్యులు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటేనే జీతం ఇచ్చేది అంటూ పలు ప్రభుత్వ శాఖలతో పాటు.. కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా నిర్ణయం తీసుకున్నాయి.. ఐటీ సంస్థల్లోనూ ఇది కొనసాగుతోంది.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇవ్వకుంటే జీతాల కట్టింగ్.. అవసరమనుకుంటే ఊస్టింగ్‌కు కంపెనీలు సిద్ధపడుతున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ నిర్ణయం ప్రకటించిన తర్వాత మరో ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయమే ప్రకటించింది. ఇప్పుడు ఇది కొత్త రిక్రూట్‌మెంట్‌కు కూడా వర్తింపచేస్తున్నాయి కొన్ని సంస్థలు..
గూగుల్ తర్వాత ఇప్పుడు ఇంటెల్ కంపెనీ తన ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది.. 2022 జనవరి 4వ తేదీలోగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆదేశించింది.. లేకపోతే వేతనం లేని సెలవుల మీద ఉద్యోగుల్ని పంపిస్తామని హెచ్చరించింది. ఇక వ్యాక్సినేషన్‌ను దూరంగా ఉంటున్న ఉద్యోగాలు.. దాని మినహాయింపు కోసం అవసరమైన పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మెడికల్, మతపరమైన కారణాలను మాత్రమే మినహాయింపులుగా పరిగణిస్తామని, ఇతర కారణాలను అంగీకరించబోదని మెమోలో పేర్కొంది ఇంటెల్ సంస్థ… వ్యాక్సినేషన్ నిబంధనలను ఉల్లంఘించినవారికి 3 నెలలపాటు జీతాలు ఇవ్వమని, అప్పటికీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోతే ఉద్యోగం నుంచి తొలగించేందేకు కూడా వెనుకాడేది లేదని చెబుతున్నారు.. ఇక, హైదరాబాద్‌లోనూ వ్యాక్సినేషన్‌కి దూరంగా ఉంటున్న ఉద్యోగుల విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాలని ఐటీ కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి.. అంతేకాదు.. ఐటీ కంపెనీలు, ఇతర చిన్న కంపెనీలు కూఏడా ఉద్యోగుల్ని వ్యాక్సినేషన్ రిపోర్టులు సమర్పించాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే సంస్థలో ఉన్న ఉద్యోగుల విషయంలోనే కాదు.. కొత్త రిక్రూట్‌మెంట్‌లోనూ కఠినంగా వ్యాక్సినేషన్ రూల్స్ ఫాలో అవుతున్నారు. వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటే.. వాళ్లకు ఉద్యోగాలు కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఐటీ, కార్పొరేట్, రియల్టి, ఫ్యాకల్టీ రంగాల్లో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌కు ప్రత్యేకంగా ఓ కాలం కేటాయిస్తున్నారంటే ఎంత సీరియస్‌గా తీసుకున్నారు అర్థం అవుతుంది.. అంతే కాదు.. ఇంటర్వ్యూ సమయంలో.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను కూడా సమర్పించాల్సి ఉంటుందట. మొత్తంగా వ్యాక్సినేషన్‌పై అందరినీ మరింత అప్రమత్తం చేసేందుకు ఇది కూడా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!