యువ భారత్ కదులుతోంది.. వ్యాక్సినేషన్ సెంటర్ల వైపు అడుగులు వేస్తోంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.. 15-18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతించిన తరుణంలో.. కేవలం మూడు రోజుల్లోనే కోటి మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ వేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.. మూడు రోజుల్లో కోటి మంది టీనేజర్లు కోవిడ్టీకాపంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. వ్యాక్సిన్వేయించుకోవడానికి ఉత్సాహం చూపుతున్న యువతను అభినందించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా… 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌పంపిణీ ప్రారంభమైన మూడు రోజులకే 1,24,02,515 టీకా డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది కేంద్రం.
Read Also: నేటి నుంచి కర్ఫ్యూ, ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్..
ఇక, బుధవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 82,26,211 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా.. అందులో 37,44,635 డోసులు కేవలం టీనేజర్లు తీసుకున్నట్టు వెల్లడించింది ఆరోగ్యశాఖ.. టీకా తీసుకున్నవారికి అభినందనలు తెలుపుతూనే.. అర్హులైనవారు వీలైనంత త్వరగా టీకాలు అందుకోవాలని సూచించారు. కాగా, కోవిడ్ తొలి దశ వ్యాక్సినేషన్‌ను 2021 జనవరి 16వ తేదీన ప్రారంభించింది కేంద్రం.. ఈ దశలో వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్వర్కర్లకు వ్యాక్సిన్లు వేయగా.. రెండో దశను 2021 మార్చి 1న ప్రారంభించారు. ఈ విడతలో 60 ఏళ్లు పైబడినవారికి, 45 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి పంపిణీ చేశారు. ఇక, ఏప్రిల్ 1వ తేదీ నుంచి.. 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతోంది.. ఇక, ఈ నెల 3వ తేదీ నుంచి టీనేజర్లకు టీకా పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే.. మొత్తంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 148.58 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది.