ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది.. అయితే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా దాని ప్రభావం ఉంటుంది.. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. ఒమిక్రాన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.. ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉంటుందని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌తో ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య చాలా తక్కువని.. ఒమిక్రాన్ మరణాలు కూడా తక్కువేనని పేర్కొంది.. ఇక, ఇప్పటికే ఒమిక్రాన్ వేరయంట్ 128 దేశాలకు వ్యాపించిందని చెబుతోంది.. ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికీ COVID-19 రోగులకు 14 రోజుల ఐసోలేషన్‌ను సిఫార్సు చేస్తోంది. చాలా మంది కోవిడ్ బాధితులు ఐదు నుండి ఏడు రోజులలోపు వైరస్ నుంచి కోలుకుంటారు.. అయితే, రాష్ట్రాలు వారి వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా ఐసోలేషన్ వ్యవధిపై నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెబుతోంది.
Read Also: కోడి పందాలపై హైకోర్టులో పిటిషన్.. ఈసారి ఉంటాయా?
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తక్కువ ఇన్‌ఫెక్షన్లు ఉన్న దేశాలలో, ఎక్కువ కాలం ఐసోలేషన్‌తో వీలైనంత తక్కువ కేసులు నమోదు కావడానికి సహాయపడుతుందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 29, 2021 నాటికి, దాదాపు 128 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.. ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల కంటే ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందనే పేర్కొంది. అధిక-ప్రమాదకర వ్యక్తులు మరియు టీకాలు వేసుకోనివారు ఇప్పటికీ ఆ వేరియంట్ నుండి తీవ్ర అనారోగ్యానికి గురువుతున్నారని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ కొన్ని వారాల వ్యవధిలో ఇతర జాతులను అధిగమించగలదని చెబుతున్నారు. ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో ప్రధానంగా టీకాలు తీసుకోనివారే ఆ మహమ్మారి బారిన పడుతున్నారని తెలిపింది. డెన్మార్క్‌లో ఆల్ఫా వేరియంట్ కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి రెండు వారాలు పట్టిందని, అయితే ఒమిక్రాన్ వేరియంట్ కేవలం రెండు రోజుల్లోనే విస్తరించిందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.
తాజావార్తలు
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!