కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం అందరికి తెలిసిందే. ప్రపంచ దేశాలు కరోనా పేరు వింటేనే వణికిపోయాయి. ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసిన కరోనా గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టింది.
దేశంలో గత 24 గంటల్లో 10,093 కొవిడ్ కేసులు నమోదయ్యాయి, ఇది శనివారం నాడు నమోదైన 10,747 కేసుల సంఖ్య కంటే 6 శాతం తక్కువ. గత రెండు వారాల్లో ఇటీవలి ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలలో దేశంలో 10,000 కేసులు నమోదవడం ఇది వరుసగా నాలుగో రోజు.
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు 11 వేలు దాటడంతో కరోనా వైరస్ మరోసారి కలవర పెడుతోంది. తాజాగా ఇవాళ కూడా రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.
The New Symptom Of The XBB.1.16 Variant: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరో కొన్ని 10 నుంచి 12 రోజుల వరకు కోవిడ్ కేసుల సంఖ్య పెరగుతూనే ఉంటుందని, ఆ తరువాత తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి వరకు ఆరు వేలలోపు నమోదు అయిన కేసులు తాజాగా 8 వేల చేరువ అయ్యాయి. భారత్‌లో గత 24 గంటల్లో 7,830 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.
దేశంలో కోవిడ్-19 వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరిగాయి. ఏప్రిల్ 9 నాటికి దేశంలో వైరస్ యొక్క క్రియాశీల కేసులు 32,000 దాటాయి. పలు రాష్ట్రాల్లో కేసులు గతంలో కంటే రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి.
దేశంలో కొవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్-19 నిర్వహణ, ప్రజారోగ్య సంసిద్ధతపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ మేరకు సూచనలు చేశారు.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నాయి. కొత్తగా రికార్టు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా మరో వేవ్ వస్తుందన్న భయాన్ని పెంచుతున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. పరిస్థితి ఆందోళనకరంగా లేదని, దగ్గు, జలుబు వచ్చినట్లే తగ్గిపోతుందన్నారు.
Carona : దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 562 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివిటీ రేటు 9.4 శాతానికి చేరిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
కరోనా టీకా వేసుకున్న తర్వాత దాని దుష్ప్రభావాల వల్ల తెలంగాణలో 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా టీకా ప్రారంభమైన 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చ్ 15వ తేదీ వరకు సంభవించిన మరణాలు, టీకా తర్వాత జరిగిన దుష్ప్రభావాలపై ఒక నివేదికను వెల్లడించింది.