కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికించిన సంగతి అందరికీ తెలిసిందే. లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారి ఎలా పుట్టిందనే అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మనుషులకు ఎందుకు సోకింది అనే మూడేళ్లుగా సమాధానం లేని ప్రశ్నపై.. చైనాలో వుహాన్ నగరంలోని... వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఓ పరిశోధకుడు... ఆశ్చర్యకరమైన విషయాన్ని తెరపైకి తెచ్చారు.
Infosys: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ‘వర్క్ ఫ్రం హోం’ పాలసీని ముగించింది. క్రమంగా తన ఉద్యోగులను ఆఫీసులకు రావాలని పిలుస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని పరిచయం చేశాయి. గత రెండేళ్లుగా కోవిడ్ దాదాపుగా తగ్గిపోయింది.
Long Covid-19: కోవిడ్ 19 వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చైనాలోని వూహాన్ నగరంలో 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్, అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీని వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ, వివిధ వేరియంట్ల రూపంలో మనుషులపై అటాక్ చేసింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కోవిడ్ సంక్రమిస్తూనే ఉంది.
COVID-19: 2019లో చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభం అయిన కరోనా మహమ్మారి, ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. తన రూపాలను మార్చుకుంటూ ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని వణికించింది. ఇటీవలే కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా కోవిడ్ ఎమర్జెన్సీని ముగించింది.
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. జూన్ మాసంలో అదికాస్త గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. జూన్ చివరి వారం కల్లా దాదాపు 6.5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు.
భారతదేశంలో 535 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసులు 6,591 నుంచి 6,168కి తగ్గాయి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
JP Nadda: ఉచితాలపై బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో జపాన్, అమెరికా, చైనా దేశాలు ఉచితాలపై డబ్బులను ఖర్చు పెట్టాయని, ఇదే ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారణం అయిందని అన్నారు. భారతదేశం మాత్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని.. ఇది మౌళిక సదుపాయాలు, వ్యవసాయం, ఇతర సెక్టార్లకు బూస్ట్ ఇచ్చిందని ఆయన అన్నారు.
Monkeypox: కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని అంతగా భయపెట్టిన వ్యాధి మంకీపాక్స్. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వ్యాధి వేల మందికి వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీ ప్రకటించింది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,282 కరోనా కేసులు నమోదు కావడం విశేషం. ఇక కరోనా వైరస్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే విజయాన్ని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారతదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు వారీ కేసులు వేలల్లోనే నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,171 కరనా ఇన్ఫెక్షన్లు నమోదు కాగా, క్రియాశీల కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, యాక్టివ్ కేసుల సంఖ్య 51,314కి తగ్గింది.