దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. అయితే, ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన వారు గుండెపోటుతో చనిపోతున్నారన్న వార్త హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు అధ్యయం చేశారు. ఈ నేపథ్యంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 యొక్క తేలికపాటి కేసులు కూడా హృదయ ఆరోగ్యంపై దీర్ఘకాలిక హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయని ఒక అధ్యయనం హెచ్చరించింది.
దేశంలో కరోనా మహమ్మారికి బ్రేక్ పడడం లేదు. గడచిన నెల రోజులుగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మరణాలు, యాక్టివ్ కేసులు కూడా ఆదే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 9,355 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి.
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశంలో రోజువారీ కోవిడ్ -19 కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 9,629 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. గత 24 గంటల్లో 29 మరణాలతో మరణాలు సంభవించాయి.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పొల్చితే ఇవాళ నమోదు అయిన కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10,112 నమోదు కాగా, సోమవారం (ఏప్రిల్ 24) భారతదేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 7,178 కొత్త కేసులు నమోదయ్యాయి.
Corona: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దాదాపు వారం రోజులుగా కేసుల సంఖ్య 10వేలు దాటుతోంది. గత వారం కాస్త అదుపులో ఉందనుకోగానే ఈ వారం భారీగా విస్తరిస్తోంది.
కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, కొవిడ్ కేసులపై నిఘా ఉంచాలని కేంద్రం 8 రాష్ట్రాలను కోరింది. డైలీ పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో గమనించాలని కేంద్రం కోరింది.
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కేద్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయగా.. రాజ్ నాథ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 12,591 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 60 వేలు దాటింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.