డిసెంబర్ 15 తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు పున: ప్రారంభం అవుతాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి మరియు ఇతర దేశాలతో షెడ్యూల్ చేయబడిన వాణిజ్య అంతర్జాతీయ విమాన సేవలను పునఃప్రారంభించే విషయాన్ని, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి…
ఏపీలో ఈరోజు కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,731 శాంపిల్స్ పరీక్షించగా.. 184 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ బాధితులు ఒక్కరు ఈరోజు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 214 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయి లో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,03,16,261…
ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశంలో 10,549 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 488 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,39,77,830 కోట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,67,468 మంది మృతి చెందారు. దేశంలో 1,10,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పనిసరిగా ప్రతి…
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టాయి.. ఇక, తెలంగాణలో డిసెంబర్ వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్, రెండో డోస్ ఎంత మంది తీసుకున్నారనే వివరాలు పక్కా సేకరించాలని చెప్పారు. ఆశాలు, ఏఎన్‌ఎంలు, వైద్యులు గ్రామస్థాయి, సబ్‌సెంటర్…
బ్రెజిల్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గడచిన 24 గంటల్లో 12,930 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల 22,043,112 సంఖ్యకి చేరింది. ఇక మంగళవారం ఒక్కరోజే 273 మంది కరోనాతో మృతి చెందగా… మొత్తం మరణాల సంఖ్య 613,339కి చేరింది. ఇక బ్రెజిల్‌లో గత ఏడురోజుల్లో సగటున 9,350మంది కరోనా బారినపడ్డారని, 213 మంది మరణించారని అక్కడి ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. లక్షలాది మంది నివసించే…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే అనేక ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్ రూపంలో వీటిని అందిస్తున్నారు. ఇండియాలో సీరం కోవీషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్, జైడస్ క్యాడిలా జైకొవ్ డీ అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. అయితే, చాలా మంది వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడరు. దీంతో ప్రత్నామ్నాయంగా మరికొన్ని పద్ధతుల్లో వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. Read: మళ్లీ…
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అనుకునే లోపే మళ్లీ కేసులు మొదలవుతున్నాయి. వ్యాక్సిన్ ను వేగంగా అందరికీ అందిస్తున్నా కరోనా నుంచి ఇప్పటి వరకు పూర్తిగా కోలుకోలేకపోయాం. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో 66 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ జరిగింది. 400 మంది విద్యార్థులున్న కాలేజీని మూసివేశారు. రెండు హాస్టల్స్ నుంచి విద్యార్థులు ఎవర్నీ బయటకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. Read: ఆ కొండ వెనుక కొండంత కష్టం……
కరోనా మహమ్మారి నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా, వ్యాక్సిన్ వేసుకుంటున్నా, కరోనా కేసులు తగ్గడం లేదు. ప్రపంచ దేశాల్లోని ప్రజలు నిబంధనలు పాటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీనిపై కేంబ్రిడ్జి పరిశోధకులు పరిశోధనలు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, రెండు మీటర్ల దూరం సోషల్ డిస్టెన్స్ పాటించినంత మాత్రాన సరిపోదని, గాలి తుంపరలో వైరస్ సుమారు మూడు మీటర్ల దూరం వరకు ప్రయాణం చేయగలుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. తుమ్మినా, దగ్గినా…
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇవాళ చేసిన కరోనా పరీక్షల్లో… పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా సోకింది. కరోనా మహమ్మారి సోకడంతో… ఆస్పత్రిలో చేరారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో తనకు పాజిటివ్ నమోదు అయిందని… ప్రస్తుతం తనకు ఎటువంటి ఆరోగ్య…
స్పూత్నిక్ లైట్ కరోనా టీకాను వచ్చే నెలలో అందుబాటులో కి తీసుకొస్తామని RDIF సీఈఓ కిరిల్ డిమిత్రివ్ తెలిపారు. ప్రస్తుతం తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ సింగిల్ వ్యాక్సిన్ దేశంలో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్‌తో ఆర్‌డీఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. స్పూత్నిక్-వీ టీకా తయారీ దారైన రష్యా పరిశోధన సంస్థ గమెలేయా ఇన్‌స్టిట్యూట్ స్పుత్నిక్ లైట్‌ను కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఇతర కరోనా టీకాలను రెండు డోసులుగా ఇస్తుండగా…