దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వైరస్.. భారత్‌లోకి వచ్చే ప్రమాదమున్నందున ప్రభావిత దేశాల నుండి విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ మహమ్మారితో ఏడాదిన్నరపాటు పోరాడామని, లక్షలాది మంది కోవిడ్ యోధుల నిస్వార్థ సేవల కారణంగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు. ఒమిక్రాన్ వచ్చిన నేపథ్యంలో యూరోపియన్‌తో సహా అనేక దేశాలు ఈ కొత్త వైరస్ ప్రభావిత దేశాలకు విమాన రాకపోకలను నిలిపేశాయని కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన…
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు విధించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అప్రమత్తం అయింది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అదీ 72 గంటల ముందు చేయించుకున్నదై ఉండాలి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక ప్రయాణికులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. Read: ఈ నౌకకు ఇంధనం అవసరం లేదు… ఎంత దూరమైనా… ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే…
ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఇద్దరు విదేశీ ప్రయాణికులకు కరోనావైరస్ పరీక్షలు చేశారు. కాగా వారికి కొత్త ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆస్ట్రేలియా అధికారులు ఆదివారం ధృవీకరించారు. శనివారం దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన మరో 14 మంది బృందంలో ఈ ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. వారికి కోవిడ్ -19 టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కాగా మిగిలిన 12 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. కొత్త…
ఒమిక్రాన్ ఈ పేరు వింటే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 26 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా 52 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. గత రెండేళ్లుగా కరోనా భయంగుప్పిట్లో ప్రపంచం కాలం గడుపుతోంది. ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ విజృంభించేందుకు సిద్దం అవుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవలే సౌత్ ఆఫ్రికాలో బయటపడింది. ఈ వేరియంట్‌లో 32 మ్యూటేషన్లు ఉన్నాయి. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ మరింత…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22, 657 శాంపిల్స్ పరీక్షించగా.. 178 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 6 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 190 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,03,72,427…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే వంద దాటిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలను పక్కనపెట్టి పబ్లిక్ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. కరోనాకు ముందు రూ.80 వరకు ఉన్న పెట్రోల్ ధరలు ఆ తరువాత వంద దాటిపోయింది. కరోనా కాలంలో ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో చమురు ధరలపై ట్యాక్స్‌ను పెంచాయి. దీంతో చమురు ధరలు అమాంతం కొండెక్కాయి. Read: కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని పెట్టడం వెనుక కారణం ఏంటి? ఆ రెండు అక్షరాలు…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు వస్తున్నాయి.. క్రమంగా అన్ని తెరచుకుంటున్నాయి.. ఈ తరుణంలో.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు కునుకులేకుండా చేస్తోంది.. భారత్‌ను కూడా ఈ కొత్త వేరియంట్ టెన్షన్ పెడుతోంది.. దీంతో.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత్ అప్రమత్తం అయ్యింది.. ఇక, రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది.. ఆరోగ్యశాఖల అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ముందుజాగ్రత్త చర్యలకు పూనుకుంటుంది.. ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై…
ప్రపంచానికి మళ్లీ కరోనా భయం పట్టుకుంది. మొన్నటి వరకు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న దేశాలు ఇప్పుడు కొత్త వేరియంట్ రాకతో భయందోళనలు నెలకొన్నాయి. 32 మ్యూటేషన్లతో భయపెడుతున్న మహమ్మారి బి.1.1.529 కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. కరోనా 19, దాని నుంచి ఏర్పడిన వేరియంట్లకు గ్రీక్ అక్షరమాల నుంచి పేర్లు పెట్టాలి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలా అన్నిటికీ గ్రీక్ అక్షరమాల నుంచి తీసుకొని పేర్లు పెట్టారు. Read: నేపాలీ…
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాలకు ఇప్పటికే విస్తరించిన ఈ వేరియంట్.. క్రమంగా మిగతా చోట్లకు విస్తరిస్తోంది. తాజాగా జర్మనీలో ఒకరు ఒమిక్రాన్ బారిన పడగా.. బ్రిటన్‌లో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. B.1.1529 వేరియంట్ బోట్స్‌వానా, బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్‌లకు వ్యాపించింది. ఒమిక్రాన్ వైరస్ కొన్ని దేశాల్లో మాత్రమే వ్యాపిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈమేరకు ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. ఒమిక్రాన్ వైరస్‌తో అప్రమత్తంగా…
దక్షిణాఫ్రికాలో ఇటీవలే కొత్త వేరియంట్ బయటపడింది. బి.1.1.529 వేరియంట్ వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. విదేశీయులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసింది బ్రిటన్ ప్రభుత్వం. అంతేకాదు, దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించాయి. ఇక జింబాబ్వే, నమీబియా, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్, శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు ఆంక్షలు విధించాయి. Read: ‘లక్ష్య’ ట్రైలర్ కు ముహూర్తం ఖరారు అమెరికాలోనూ రేపటి నుంచి విధించిన ఆంక్షలు…