బ్రెజిల్‌లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నా కరోనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రెజిల్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గడచిన 24 గంటల్లో 12,930 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల 22,043,112 సంఖ్యకి చేరింది. ఇక మంగళవారం ఒక్కరోజే 273 మంది కరోనాతో మృతి చెందగా… మొత్తం మరణాల సంఖ్య 613,339కి చేరింది. ఇక బ్రెజిల్‌లో గత ఏడురోజుల్లో సగటున 9,350మంది కరోనా బారినపడ్డారని, 213 మంది మరణించారని అక్కడి ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. లక్షలాది మంది నివసించే ప్రాంతాల్లో 10,489 మంది ఇన్ఫెక్షన్స్‌కు గురవ్వగా … 291.9 మంది మరణిస్తున్నారని కరోనా లెక్కలు చెబుతున్నాయి.
కాగా, బ్రెజిల్‌లో అత్యధిక జనాభా కలిగి ఉన్న ఆగేయ రాష్ట్రమైన సావో పాలోలో 4,433,915 కరోనా కేసులు నమోదయ్యాయని, 153,639 మంది కరోనాకు బలయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఆ రాష్ట్రానికి పొరుగున ఉన్న రియో డి జనీరో రాష్ట్రంలో 1,339,819 కేసులు నమోదు అవ్వగా 68,919 మంది మృతి చెందారు. మరోవైపు ఆ దేశంలో 13 కోట్ల 4 లక్షల మంది రెండు డోసుల వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. మంగళవారం నాటికి 15 కోట్ల 82 లక్షల మంది మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటికి ప్రపంచంలో కోవిడ్ మరణాల్లో అమెరికా మొదటిస్థానంలో ఉండగా.. రెండోస్థానంలో బ్రెజిల్ నిలిచింది. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కేసులు కలిగిన ఉన్న మూడో స్థానంలో భారత్ నిలిచిందని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!