కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అనుకునే లోపే మళ్లీ కేసులు మొదలవుతున్నాయి. వ్యాక్సిన్ ను వేగంగా అందరికీ అందిస్తున్నా కరోనా నుంచి ఇప్పటి వరకు పూర్తిగా కోలుకోలేకపోయాం. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో 66 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ జరిగింది. 400 మంది విద్యార్థులున్న కాలేజీని మూసివేశారు. రెండు హాస్టల్స్ నుంచి విద్యార్థులు ఎవర్నీ బయటకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
Read: ఆ కొండ వెనుక కొండంత కష్టం… ప్రపంచానికే నష్టం…
ఇప్పటి వరకు 300 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 66 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో వందమందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. పాజిటివ్‌గా తేలిన విద్యార్థులు ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారని వైద్య అధికారులు తెలిపారు. హస్టల్‌లోనే విద్యార్థులను క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారుల తెలిపారు.