ఇండియా ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8,488 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో 249 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 12,510 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు 3,39,34,547 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం దేశ్యాప్తంగా…
UN-మద్దతుగల COVAX గ్లోబల్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కింద 50 లక్షల డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను నేపాల్, తజికిస్తాన్, మొజాంబిక్ లకు ఎగుమతి చేయడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ మూడు దేశాలతో పాటు, SII COVAX కింద కోవిషీల్డ్‌ను బంగ్లాదేశ్‌కు కూడా ఎగుమతి చేయనున్నట్టు వారు తెలిపారు. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నవంబర్ 23 నుంచి COVAX ప్రోగ్రామ్ కింద కోవిడ్…
దేశంలో కరోనా బూస్టర్ డోసు ఆవశ్యకతపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొందరూ వేసుకుంటే మంచిదని, మరికొందరూ రెండు డోసులు కాకుండా ఇంకొటి కూడా వేసుకోవాలా అంటూ పెదవి విరుస్తున్నారు. దీనిపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక వ్యాఖ్యలు చేసింది. శాస్త్రీయ ఆధారాల ప్రకారం బూస్టర్ డోసు తీసుకోవాలని ఖచ్చితంగా ఎక్కడా లేదని ఐసీఎంఆర్‌లో అంటూరోగాల విభాగం హెడ్ సమీరన్ పాండా…
ఏపీలో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 24,659 శాంపిల్స్ పరీక్షించగా.. 174 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు కరోనా కారణంగా ఎవరు మరణించలేదు. ఇక, ఇదే సమయంలో 301 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,78,784 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,244…
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 22,902 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 103 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో తాజాగా ఒకరు మరణించారు. తాజా కేసులతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,74,555 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం మృతుల సంఖ్య 3,981కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49 కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 153 మంది…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. రోజుకు 200కి పైగానే కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. వైరా గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 650 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించామని… వీరిలో 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. Read…
ఇండియాలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,488 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,10,413 కి చేరింది. ఇందులో 3,39,22,037 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,22,714 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 313 మంది మృతి చెందారు. దీంతో…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 25,197 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందరు. ఇదే సమయంలో 196 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,54,125 కు చేరింది.. మొత్తం…
కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు టీకా తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో ప్రపంచంలో కోట్లాది మందికి టీకాలు వేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని నిబంధనలు ఉండటంతో వేగాంగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇక, చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ కొన్ని దేశాల్లో మొదలైంది. కాగా, ఇప్పుడు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. 18 ఏళ్లు నిండిన అందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. రెండు డోసులు తీసుకున్నవారు బూస్టర్…
కోవిడ్ బారిన పడ్డ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. AIG ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు తెలిపారు. కోవిడ్ తో హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు గవర్నర్. ఆయనకు సంబంధించి వైద్యులు అన్నీ చూసుకుంటున్నారు. సాధారణ స్థితిలో ఆక్సిజన్ స్థాయిలు వున్నాయని వైద్యులు తెలిపారు. ఏఐజీ హాస్పిటల్ లోని వైద్య బృందం పర్యవేక్షణలో గవర్నర్‌కి వైద్య చికిత్స అందిస్తున్నారు. 88…