స్పూత్నిక్ లైట్ కరోనా టీకాను వచ్చే నెలలో అందుబాటులో కి తీసుకొస్తామని RDIF సీఈఓ కిరిల్ డిమిత్రివ్ తెలిపారు. ప్రస్తుతం తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ సింగిల్ వ్యాక్సిన్ దేశంలో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్‌తో ఆర్‌డీఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. స్పూత్నిక్-వీ టీకా తయారీ దారైన రష్యా పరిశోధన సంస్థ గమెలేయా ఇన్‌స్టిట్యూట్ స్పుత్నిక్ లైట్‌ను కూడా రూపొందించిన విషయం తెలిసిందే.
ఇతర కరోనా టీకాలను రెండు డోసులుగా ఇస్తుండగా స్పూత్నిక్ లైట్ మాత్రం ఒక్క డోసుగా ఇస్తే సరిపోతుంది. స్పూత్నిక్-వీ డిజైన్ ఆధారం గానే ఈ టీకాను రష్యా పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. దీని ప్రభావశీలత దాదాపు 80 శాతమని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తేలింది. ఇక భారత్‌లో స్పుత్నిక్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు డా. రెడ్డీస్ ల్యాబ్స్ రష్యా ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఆర్‌డీఐ ఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. . భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్ 100 మిలియన్ స్పూత్నిక్-వీ డోసుల పంపిణీకి చేసేలా రెండు సంస్థల మధ్య గతంలోనే డీల్ కుదిరింది.