ఒమిక్రాన్ వేరియంట్‌పై మోడెర్నా సీఈఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్‌కు అడ్డుకట్ట వేయలేవని అన్నారు. మోడెర్నా సీఈఓ స్టీఫెన్ బాన్సెల్ చేసిన కామెంట్లు ప్రపంచం మొత్తాన్ని కుదిపేశాయి. స్టీఫెన్ చేసిన ఈ వ్యాఖ్యలతో షేర్ మార్కెట్లు దద్దరిల్లిపోయాయి. అటు క్రూడాయిల్ ధరలు భారీగా క్షీణించాయి. ప్రపంచంలోని అన్ని వ్యాక్సిన్లు అన్ని దేశాల్లో ఒకే రకమైన సామర్థ్యంతో పనిచేయబోవని, అందుకే డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిందని, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్…
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. దీంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.. ఇక, ఈ కొత్త వేరియంట్‌పై రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు.. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో మాట్లాడిన ఆయన… ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నామని, పాజిటివ్…
సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన తర్వాత ఆ దేశం నుంచి ఎవ్వరు వచ్చినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.. తాజాగా, సౌతాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన మరో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి, చండీగఢ్‌కు వచ్చిన ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.. అయితే, అది ఒమిక్రాన్ వేరియంటా అనే టెన్షన్ నెలకొనగా.. బెంగళూరుకు వచ్చిన వారిలో ఒకరిలో డెల్టా, మరొకరిలో డెల్టా ప్లస్‌కు భిన్నమైన వేరియంట్‌గా నిర్ధారించారు..…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఇక, ఇప్పుడు సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను కలవర పెడుతోంది.. జట్ స్పీడ్‌తో వ్యాపిస్తున్న ఈ వైరస్.. అత్యంత ప్రమాదకారి అని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించగా.. మరోవైపు.. ఒమిక్రాన్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంపై కూడా దృష్టిసారించారు శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం షురూ…
ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం విదేశీ ప్రయాణికులపై ఫోకస్ పెట్టింది. సౌత్ ఆఫ్రికా, బోట్స్‌వానా, హంగ్‌కాంగ్ నుంచి వస్తున్న వారి పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. 12 దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. త్వరలోనే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి తెస్తామన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారిలో పాస్‌పోర్ట్‌లో ఏపీ అడ్రస్ ఉన్న వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అధికారులు. ప్రస్తుతం ఏపీలో రికవరీ…
దేశంలో ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ను అపాలంటే బూస్టర్ డోస్ కచ్చితం అనటం హాస్యాస్పదం అన్నారు డాక్టర్ యు.రఘురాం. అత్యధిక బూస్టర్ డోస్ వేసుకున్న ఇజ్రాయెల్ లో ఫోర్త్ వేవ్ నడుస్తూ భారీ కేసులు నమోదవుతున్నాయన్నారు. టెక్నికల్ గా కోవిషీల్డ్ లో అప్డేటెడ్ బూస్టర్ రాదన్నారు. వేసుకున్నా ఆ బూస్టర్ డోస్ పని చేస్తుందని నమ్మకం లేదన్నారు. కోవాక్సిన్ లో సాధారణ ఫ్లూ వ్యాక్సిన్స్ లు, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ బూస్టర్ తీసుకోవచ్చు…
తెలంగాణ కేబినేట్ భేటిలో చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ మంత్రులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఐదు గంటల పాటు కేబినేట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. కరోనా పరీక్షలు పెంచాలని నిర్ణయం. మందులు, వ్యాక్సిన్‌లు సమకూర్చుకోవాలని ఆదేశం. ఇప్పటికే ఒమిక్రాన్ పై మంత్రి హరీష్ రావు అధ్యక్షతన సబ్‌కమిటీని వేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంవంతం చేయాలని సూచించారు. వైద్యాఆరోగ్య శాఖతో…
ప్రపంచం మొత్తాన్ని ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ సూచీలు కొంత ఆందోళన కలిగించాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే, ఇది కేవలం అరగంట మాత్రమే అని స్పష్టమయింది. కోనుగోళ్ల తాకిడి పెరగడంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి. రిలయన్స్ టారిఫ్ ధరలు పెంచడం, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటుగా మరణాలు కూడా అధిక సంఖ్యలో సంభవించాయి. కరోనా కాలంలో మరణించిన వ్యక్తులను ప్రభుత్వమే ఖననం చేసింది. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు నిబంధనలు లేకపోవడంతో ప్రభుత్వమే ఖననం చేసింది. అయితే, బెంగళూరులోని ఈఎస్ఐ ఆసుపత్రిలో గత సంవత్సరం కాలంగా రెండు మృతదేహాలు ఖననం చేయకుండా మార్చరీలోనే ఉండిపోయాయి. అయితే, డిసెంబర్ 2020 లో ఈ ఆసుపత్రిలోనే కొత్త మార్చరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త…
ప్రపంచాన్ని కోవిడ్ కొత్త వేరింయట్ ఒమిక్రాన్ వణికిస్తుంది. ఇప్పుడిప్పుడే అన్ని సాధారణ స్థితికి వస్తున్న వేళ కొత్త వేరింయట్‌తో ఆయా దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఊహించని విధంగా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది. దాని లక్షణాలు తెలుసుకునే లోపే అది ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని తట్టుకుని వ్యాపిస్తున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర దేశాల నుంచి భారత్ లోకి వచ్చినవారికి కోవిడ్ టెస్టులు చేయడంతో పాటు వారికి 14 రోజులు క్వారంటైన్ విధిస్తున్నారు.…