తెలంగాణ కేబినేట్ భేటిలో చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ మంత్రులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఐదు గంటల పాటు కేబినేట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. కరోనా పరీక్షలు పెంచాలని నిర్ణయం. మందులు, వ్యాక్సిన్‌లు సమకూర్చుకోవాలని ఆదేశం. ఇప్పటికే ఒమిక్రాన్ పై మంత్రి హరీష్ రావు అధ్యక్షతన సబ్‌కమిటీని వేశారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంవంతం చేయాలని సూచించారు. వైద్యాఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ర్టలోని 6 జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యా ఆరోగ్య శాఖను ఆదేశించారు. మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట్, గద్వాల్, కొమురంభీమ్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో మత్రులంతా పర్యటించి తాజా పరిస్థితిని సమీక్షించాలన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందకుండా అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. వైద్యాఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.