నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ నవంబర్ 22న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. విదేశాలకు వెళ్లొచ్చాక కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో అదే రోజు శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో కమల్ చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న కమల్ తాజాగా కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆసుపత్రి అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు డిసెంబర్ 3 వరకు కమల్ హాసన్ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,018 శాంపిల్స్ పరీక్షించగా… 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 153 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,187కు చేరుకోగా… రికవరీ కేసులు 6,68,564కు పెరిగాయి.. ఇక, మృతుల…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ప్రతీ రోజూ 100కి పైగానే నమోదు అవుతూ వస్తున్నాయి.. అయితే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22,595 శాంపిల్స్ పరీక్షించగా.. 184 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు.. ఇదే సమయంలో 183 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,04,46,677 కరోనా నిర్ధారణ పరీక్షలు…
ప్రపంచానికి ఒమిక్రాన్ భయం పట్టుకుంది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకరం కావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంత వరకు పనిచేస్తాయనే దానిపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో నవంబర్ 14 వ తేదీన అ వేరియంట్ బయటపడింది. ఆ తరువాత క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోని 14 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించినట్టు అధికారికంగా గుర్తించారు. అత్యధిక…
ప్రంపంచదేశాలను వణికిస్తోంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్న తరుణంలో.. మరోసారి ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు.. ఇప్పటికే 14 దేశాలను చుట్టేసింది కొత్త వేరియంట్.. దీంతో అన్ని దేశాలు నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి.. అంతర్జాతీయ ప్రయాణలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. వ్యాక్సిన్ వేసుకున్నా, టెస్ట్ చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్‌తో వచ్చినా.. మళ్లీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. దేశ పౌరులు, వలసదారులకు కువైట్ సర్కార్ కీల ఆదేశాలు జారీ…
ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన 12 దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ఈ అర్ధరాత్రి నుంచి ఆంక్షలు విధించనున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే తెలంగాణాలో అన్ని చోట్ల వైద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా వేగంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుని వారు వెంటనే వేసుకోవాలని ఆయన వెల్లడించారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణి కుంలందరికి ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామన్నారు. ఒకవేళ వారికి…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. దక్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాలకు వ్యాపించింది. దీంతో యూరప్ దేశాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఇజ్రాయిల్ దేశం సరిహద్దులు మూసివేసింది. జపాన్‌లో మొదటి కేసు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలంతో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పని సరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ వచ్చేవరకు వారు ఎయిర్‌పోర్ట్‌లోనే…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్చ మరోసారి తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,925 శాంపిల్స్ పరీక్షించగా.. 184 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 3 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 134 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,04,17,082 కు చేరుకోగా… మొత్తం…
ప్రస్తుతం కరోనా అదుపులో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ అన్నారు. ఇందుకు సంబంధించి ఇవాళ రాజ్య సభలో ఒమిక్రాన్ వేరియంట్ చర్చకు వచ్చింది. అసలు కేసులు ఉన్నాయ అని సభ్యలు ప్రశ్నించారు. ఈ మేరకు రాజ్యా సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని రాజ్యాసభలో స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.…
ఒమిక్రాన్ పేరు వింటే ప్రపంచం గజగజవణికిపోతోంది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా ఒమిక్రాన్‌ను గుర్తించారు. ఆ తరువాత ప్రపంచాన్ని ఈ వేరియంట్ గురించి హెచ్చరికలు జారీ చేయడంతో ఆన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయి. నిన్నటి రోజున జపాన్ వీదేశీయులపై నిషేదం విధించింది. ఇలా నిషేదం విధించిన మరుసటిరోజే జపాన్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం… అప్రమత్తమైన యంత్రాంగం… నమీబియా నుంచి వచ్చిన ప్రయాణికుడికి ప్రభుత్వ నిబంధనల…