కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మొదట రెండు వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భారత ప్రభుత్వం.. ప్రస్తుతం.. దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నారు.. అయితే, కోవాగ్జిన్ సమర్థతపై కీలక ప్రకటన చేసింది ఐసీఎంఆర్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది.. కొత్త వేరియంట్లను కూడా లోకల్ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటుందని తెలిపింది.. భారత వైద్య పరిశోధన మండలి.. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌పై కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని, సార్స్-కోవ్-2కు…
ప్రస్తుతం 45 ఏళ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. మే 1వ తేదీ 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది.. అయితే, 45 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ టీకా ఉచితమే అయినా.. 18 ఏళ్ల పైబడిన వారి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు కేంద్రం.. అంటే.. ఆ భారాన్ని.. వినియోగదారులు లేదా.. రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మే 1వ తేదీ నుంచి 18…
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఏ రాష్ట్రంలోలేని విధంగా అక్కడ ఏకంగా ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ.. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగియగా.. మరో మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఇక, ఎన్నికల ముందు నుంచీ అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో.. ప్రధాని మోడీని టార్గెట్ చేసి విమర్శలు…
కరోనా సెకండ్ వేవ్ కలవర పెడుతోంది.. పాజిటివ్ కేసుల సంఖ్యే కాదు.. క్రమంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా.. ఒకే కుటుంబంలో నలుగురు, ముగ్గురు, ఇద్దరు ఇలా ప్రాణాలు వదులుతున్నారు.. నిన్న జగిత్యాలలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందగా.. విజయవాడలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు కన్నుమూశారు.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఇద్దరు దంపతులు కరోనాతో కన్నుమూశారు.. పూర్తి వివరాల్లోకి…
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ నిల్వలు తగ్గిపోవడంతో అనేక జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ కావాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు ఉదయం రాష్ట్రానికి 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 7.5 లక్షల డోసులు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చిన 6 లక్షల డోసులను అవసరమైన జిల్లాలకు ప్రభుత్వం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది.
దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నది. రోజువారీ కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 2,95,041 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,16,130కి చేరింది. ఇందులో 1,32,76,039 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 21,57,538 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,67,457 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో రికార్డ్ స్థాయిలో 2023 మంది…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6,542 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.67 లక్షలకు చేరింది. ఇందులో 3.19 లక్షల మంది డిశ్చార్జ్ కాగా, 46,488 కేసులు యాక్టివ్ గా…
ఇండియాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారికి వారు వీరు అనే తేడా లేదు. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వారికి కరోనా సోకుతున్నది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. అనేక రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం కరోనా బారిన పడ్డారు. ఇటీవలే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కరోనా బారిన పడ్డారు. ఇక ఇదిలా…
కెసిఆర్ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. “తెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని చూస్తే రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టమవుతోంది. టెస్టుల నిర్వహణ, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అప్పుడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించింది. అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదు. విద్యాసంస్థలను మాత్రం మూయించి సభలు, ర్యాలీలు, వైన్ షాపులు, పబ్‌లు, క్లబ్‌లు, గుంపులు…
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉదృతంగా ఉండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే అర్హులైన అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పటికే దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద సంఖ్యలో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. దాదాపుగా ఇప్పటి వరకు దేశంలో 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. ఎంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ లను అందిస్తున్నారో అదే లెవల్లో వ్యాక్సిన్ వృధా అవుతున్నది. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. వ్యాక్సిన్ వృధాపై ప్రధాని మోడీ అసంతృప్తి…