దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక సమూహాల్లో వైరస్ మహమ్మారి వేగం మరింత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటె, కరోనా మహమ్మారి ఢిల్లీలోని తీహార్ జైలును వణికిస్తోంది. దేశంలోని వివిధ జైళ్లలోని ఖైదీలు కరోనా బారిన పడుతున్నారు. రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా సోకిన ఖైదీలను ప్రత్యేక బ్యారక్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, కరోనా సోకిన నలుగురు ఖైదీలు చికిత్స…
కరోనా మహమ్మారి దేశం నలుమూలలా వ్యాపిస్తోంది. నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల్లో కూడా కరోనా వ్యాపించింది. ప్రస్తుతం గ్రామాలకు మహమ్మారి భయం పట్టుకున్నది. వివిధ నగరాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి గ్రామాలకు వస్తుండటంతో గ్రామాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్ లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, మధ్యప్రదేశ్ లోని అగర్-మాల్వా గ్రామంలో ఈనాటి వరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 2020లో కరోనా మహమ్మారి వ్యాపిస్తుందన్న సమయంలో ఆ గ్రామంలోని ప్రజలు అప్రమత్తటం అప్రమత్తం అయ్యారు. ఇళ్లను…
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు ఉగ్రరూపం దాల్చుతున్నది. గత తొమ్మిది రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న కూడా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలో 3.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3500 లకు పైగా మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 60వేలు దాటిపోతున్నాయి. మహారాష్ట్రతో పాటుగా కేరళ, కర్ణాటక, ఉత్తర…
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతు నొప్పితో పాటుగా ఇంకా అనేక లక్షణాలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. అయితే కరోనా మహమ్మారి చర్మంపై కూడా ప్రభావం చూపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. జ్వరంతో పాటుగా చర్మంపై దద్దుర్లు వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యనిపుణులు చెప్తున్నారు. చర్మంపై రక్తం గడ్డగట్టడం ఎరుపు లేదా నలుపు లేదా వంకాయ రంగుల్లో చర్మం మారితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక కరోనా బారిన…
రాష్ట్రాలకు ఉపశమనం కలిగిస్తూ నిన్న సీరం.. తన వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధరలు తగ్గించగా.. ఇప్పుడు.. భారత్ బయోటెక్ సంస్థ కూడా గుడ్ న్యూస్ చెప్పింది.. రాష్ర్టాలకు అందించే కొవాగ్జిన్ ధరలను తగ్గించింది.. కొవాగ్జిన్ ఒక్క డోసును రూ. 400కే సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కాగా, గతంలో ఒక్క డోసును రూ. 600గా నిర్ధారించిన భారత్ బయోటెక్.. ఇప్పుడు ఏకంగా ఒక్క డోసుపై రూ. 200కు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, కోవిషీల్డ్ టీకా ధరను సీరం…
కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల ప్రాణాలు తీసింది.. పోలీసుల విభాగంలోనూ పెద్ద ఎత్తున కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా.. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్ ప్రసాద్ కరోనా మృతి చెందారు. పోలీస్ శాఖలో సౌమ్యుడిగా, సమర్ధవంతమైన అధికారిగా పేరుపొందిన ఆయన.. కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. గత 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఇవాళ ఆయన పరిస్థితి మరింత విషమించి కన్నుమూశారు.. కృష్ణ జిల్లా…
ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది.. ఇప్పటికే వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది.. ఇక, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారు కూడా యాడ్ కానున్నారు.. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అపాయింట్లు మాత్రం ఇవ్వడం లేదు.. ఇక, కోవిడ్ వాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… కీలక వ్యాఖ్యలు చేశారు.. కోవిడ్‌కు ఇప్పుడు కేవలం వాక్సినేషన్ మాత్రమే ఒక పరిష్కారంగా…
ఏపీలో 15 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 74748 మందిని టెస్ట్ చేస్తే 14669 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. అలాగే 24 గంటల్లో 71 మరణాలు సంభవించాయని ఆయన పేర్కొన్నారు. ఒకట్రోండు రోజుల్లో ట్రూనాట్ టెస్టులు చేపడతామని… కోవిడ్ చికిత్స కోసం 422 ఆస్పత్రులకు అనుమతించామన్నారు. 5572 ఐసీయూ బెడ్లల్లో 2570 బెడ్లు ఖాళీగా ఉన్నాయని..ఆక్సిజన్ బెడ్లు 7744 బెడ్లు అందుబాటులో…
భారత్‌లో కరోనా వైరస్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే, కేంద్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది అని మండిపడ్డారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ప్రధాని మోడీకి ముందుచూపు లేకపోవటం వల్లే కరోనా వైరస్ విజృంభించిందని విమర్శించారు.. దేశంలో కరోనాతో ప్రస్తుత పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయని.. ఇప్పటికైనా మహమ్మారి కట్టడికోసం చర్య తీసుకోవాలన్నారు.. తెలంగాణలో కూడా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఒవైసీ..…