తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే 10 శాతానికి పైగా కరోనా వృద్ధి కనిపించింది. దీంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ ను తప్పనిసరి చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపాపధ్యంలో ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండల కేంద్రంలో గత రెండు రోజుల వ్యవధిలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. మండలకేంద్రంలో వారం రోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్…
దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇండియాలో కొనసాగుతోంది. అయితే, వ్యాక్సిన్ కోసం అనేకమంది భారతీయులు నేపాల్ బాటపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు, అనేకమంది భారతీయులు చైనాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. చైనాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అలానే చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో చదువుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు . ఎవరైనా సరే చైనాలో అడుగుపెట్టాలి అంటే చైనా వ్యాక్సిన్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రోజు 35 వేలకు పైగా టెస్టులు చేస్తుండగా ఆరు నుంచి ఏడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసుల శాతం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 35 వేల టెస్టులు చేస్తేనే ఏడువేలకు పైగా కేసులు వస్తే ఇక లక్ష వరకు రోజువారీ టెస్టులు నిర్వహిస్తే ఎన్ని కేసులు వస్తాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో కేసులు పెరగడంపై ప్రభుత్వం…
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. ఇందులో 1,26,71,220 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,79,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1341 మంది మృతి చెందారు. …
దేశంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్ లో పెద్ద వయసుకలిగిన వ్యక్తులకు కరోనా సోకగా, సెకండ్ వేవ్ లో ఎక్కువమంది యువత కరోనా బారిన పడుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు, వేడుకలు, పబ్లిక్ ప్లేస్ లు కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. ఎక్కువ మంది ఒక చోట గుమికూడి ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో కంటే కరోనా నగరాల్లో అధికంగా విస్తరిస్తోంది. 2టైర్, 3 టైర్ నగరాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన…
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జ్వరం, జలుబు వంటి లక్షలు ప్రాధమికంగా కరోనా లక్షణాలుగా ఉండేవి. అయితే, జ్వరం, జలుబు ఉన్న వ్యక్తులందరికి కరోనా వస్తుందని అని గ్యారెంటీ లేదు. ఈ ప్రాధమిక లక్షణాలతో పాటుగా ఇప్పుడు మరికొన్ని లక్షణాలు కూడా వచ్చి చేరాయి. జ్వరంతో పాటుగా ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. అంతేకాదు, తలనొప్పి, నీరసం వంటి వాటితో బాధపడే వ్యక్తులకు టెస్టులు చేసినపుడు కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే గాలి నుంచి…
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారు.. అయితే,…
ఉత్తరాఖండ్ లో జరుగుతున్న కుంభమేళాపై కరోనా కోరలు చాస్తోంది. కుంభమేళాకు హాజరయ్యే భక్తులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఇక బుధవారం రోజున నిర్వహించిన రాజస్నానం కార్యక్రమంలో లక్షల సంఖ్యలో సాధువులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే, ఇలా రాజస్నానం చేసేందుకు హాజరైన నాగా సాధువుల్లో 30 మందికి కరోనా సోకింది. దీంతో కుంభమేళాలో అలజడి మొదలైంది. నిరంజని, జావాతో పాటుగా అనేక అఖాడాకు చెందిన సాధువులు కరోనా బారిన పడినట్టు వైద్యనిపుణులు చెప్తున్నారు. సాధువులకు కరోనా టెస్టులు…