ప్రస్తుతం 45 ఏళ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. మే 1వ తేదీ 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది.. అయితే, 45 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ టీకా ఉచితమే అయినా.. 18 ఏళ్ల పైబడిన వారి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు కేంద్రం.. అంటే.. ఆ భారాన్ని.. వినియోగదారులు లేదా.. రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి కూడా ఉచితంగానే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. ఈ మేరకు యూపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన.. భారత్‌లో కరోనావైరస్ నిర్మూలనకు తమ సర్కార్ చేయాల్సిన కృషి అంతా చేస్తుందని.. కరోనా వైరస్ ఓడిపోతుంది.. భారత్ గెలుస్తుంది అంటూ ట్వీట్ చేశారు.
కాగా, భారత్‌లో సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లోనూ భారీగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి.. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు యూపీలోనే వెలుగు చూస్తున్నాయి.. చివరకు సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా కరోనా బారినపడ్డారు. ఇక, కరోనా కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్న యూపీ… వీకెండ్ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.. శుక్రవారం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటలవరకు లాక్ డౌన్ అమలులో ఉండబోతోంది. ఈ సమయంలో నిత్యావసరాలను మాత్రం మినహాయింపులు ఉంటాయని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.