ఇండియాలో కరోనా విలయం మామూలుగా లేదు. ప్రతి రోజూ 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఇండియా మరింత డేంజర్ లో పడనుంది. ఇలాంటి సమయంలో ఇండియాకు సహాయం చేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గూగుల్ ముందుకు వచ్చింది. ఏకంగా రూ.135 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న గీవ్ ఇండియాకు, యూనిసెఫ్ కు ఈ ఫండ్ అందించనున్నట్లు…
తెలంగాణలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఫ్రీగా వాక్సినేషన్ ఇస్తామని నిన్న సీఎం కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై షర్మిల సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. “చావు భయంతో చస్తున్న ప్రజలను అప్పులపాలు చెయ్యడం అమానుషం. ప్రజల మాట, మా మాట విని అందరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు KCR గారికి ధన్యవాదాలు. ఇప్పుడైనా మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చచ్చి బతికిన వారిని ఆదుకోవాలని…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా రోగులకు ఆక్సిజన్, బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కరోనా పాజిటివే కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడగిస్తున్నట్లు సిఎం కేజ్రీవాల్ ప్రకటన చేశారు.…
కరోనా వ్యథలు అన్నీ ఇన్ని కాకుండా పోయాయి.. కరోనా బారినపడిన ఆస్పత్రులకు వెళ్తే.. తిరిగి వస్తారా? అని గ్యారేంటి లేని పరిస్థితి.. ఇక, విశాఖలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. కేజీహెచ్ సి ఎస్ ఆర్ బ్లాక్ వద్ద కరోనా పేషెంట్లు, బంధువులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు వచ్చాయి.. గంటల తరబడి బెడ్స్ కోసం వేచివుంటున్నా వైనం ఎక్కడచూసినా కనిపిస్తోంది.. బెడ్స్ లేక ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు కోల్పోతున్నారు కరోనా రోగులు… కరోనా పేషెంట్లకు సరిగ్గా…
భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య ఇప్పటికే మూడు లక్షలు క్రాస్ చేయగా.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తోంది.. అయితే ఇవాళ కాస్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. ఇక, ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి, ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు.. అయితే, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్, వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ లాంటి కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి… కేసులు భారీగా…
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా విస్తరిస్తోంది.. దేశవ్యాప్తంగా ఒకే రోజు నమోదైన కేసులు 3 లక్షలకు చేరువ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కరోనా మృతుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతూనే ఉంది. కనిపించని మహమ్మారితో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, మెడికల్ సిబ్బంది కూడా ప్రాణాలువిడుస్తున్నారు.. ఇక, మహారాష్ట్ర, దాని రాజధాని ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాజాగా, ముంబైకి చెందిన ఓ మహిళా వైద్యురాలు.. ఫేస్‌బుక్‌లో ఇదే నా చివరి…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. అన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు.. కొన్ని రాష్ట్రాలు అయితే లాక్‌డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నాయి.. అయితే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాక్‌డౌన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని స్పష్టం చేశారు దీదీ.. ఇక, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. మే 5వ తేదీ నుంచి రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్…
కర్ణాకటపై కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 23,558 కొత్త కేసులను నమోదు అయ్యాయి.. కర్ణాటకలో ఒకేరోజు ఇంత భారీస్థాయిలో కొత్త కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి.. కోవిడ్ బారిన పడి 116 మంది మృతిచెందగా.. ఇదే సమయంలో 6,412 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్…
కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా కల్లోలమే సృష్టిస్తోంది.. అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.. ఇక, కోవిడ్‌తో ముందుండి పోరాటం చేసే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో మహమ్మారి బారినపడుతూనే ఉన్నారు.. తాజాగా.. బీహార్‌లోని పాట్నా ఎయిమ్స్ లో ఏకంగా 384 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. బాధితుల్లో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. గతంలో పాజిటివ్ కేసులు నమోదు అయినా.. ఒకే సారి ఇంత పెద్ద…
ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. రోజురోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. పది వేలకు చేరువయ్యాయి రోజువారి పాజిటివ్ కేసులు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 39,619 సాంపిల్స్ పరీక్షిం చగా 9,716 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.. 24 గంటల్లోనే కోవిడ్‌తో 38 మంది మృతిచెందడం కలకలం రేపుతోంది.. కోవిడ్…