కరోనా సెకండ్ వేవ్ కలవర పెడుతోంది.. పాజిటివ్ కేసుల సంఖ్యే కాదు.. క్రమంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా.. ఒకే కుటుంబంలో నలుగురు, ముగ్గురు, ఇద్దరు ఇలా ప్రాణాలు వదులుతున్నారు.. నిన్న జగిత్యాలలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందగా.. విజయవాడలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు కన్నుమూశారు.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఇద్దరు దంపతులు కరోనాతో కన్నుమూశారు..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్‌కు చెందిన ఎంఐఎం నేత గోరేమియా కోవిడ్ బారినపడ్డారు.. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. హైదరాబాద్‌కు తరలించారు.. అయితే, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ప్రాణాలు వదిలారు గోరేమియా.. ఇక, ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఓవైపు భర్త అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తరలిస్తుండగా, ఆయన భార్య కూడా కన్నుమూసింది.. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గంట వ్యవధిలోనే ఆ ఇద్దరు దంపతులు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.