మాస్క్ ధరించని కెసిఆర్ పై ఫైన్ వేయాలి : రాములమ్మ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెసిఆర్ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. “తెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని చూస్తే రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టమవుతోంది. టెస్టుల నిర్వహణ, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అప్పుడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించింది. అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదు. విద్యాసంస్థలను మాత్రం మూయించి సభలు, ర్యాలీలు, వైన్ షాపులు, పబ్‌లు, క్లబ్‌లు, గుంపులు గుంపులుగా తీరుగుతున్న జనాన్ని కట్టడి చేయడం, బెడ్స్ కొరత గురించి న్యాయమూర్తులడిగిన ప్రశ్నలకు నీళ్ళు నమిలారు. సరైన సమాచారం లేని ప్రభుత్వ నివేదికల్లోని లోపాలపై హైకోర్టు నిలదీసింది. సరిగ్గా కిందటేడాది ఏం తప్పులు జరిగాయో… అవే ఇప్పుడూ పునరావృతం అవుతున్నందువల్లే రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిందనే విషయాన్ని సర్కారు గ్రహించడం లేదు, గుణపాఠం నేర్చుకోవడం లేదు. కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ గారు అంతకుముందు మాస్క్ లేకుండా సమీక్షలు నిర్వహించి, సభల్లో పాల్గొన్న ఫొటోలు మీడియాలోను, సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయి. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆరెస్ నాయకులు వారి అధినేత బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారారు. తెలంగాణలో మాస్కులు ధరించనివారికి వేలకు వేలు ఫైన్లు వేస్తున్నారు. ఆ ఫైన్ ఏదో మాస్కు ధరించని కేసీఆర్ గారికి, ఆ పార్టీ నేతలకు కూడా వేసి ఉంటే పాపం ఆయన జాగ్రత్త పడేవారు కదా అనిపిస్తోంది. ఇక రాత్రివేళ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు కానీ పగటి పూట ఎలాంటి నియంత్రణలూ లేకుండా ఈ ప్రభుత్వం సాధించదలుచుకుంది ఏమిటో అర్థం కావడం లేదు. ఈ నేతలు, ఈ సర్కారును నమ్ముకుంటే ఇంతే సంగతులని జనానికి బాగా అర్థమయ్యేలా చేస్తున్నారు.” ఫైర్ అయ్యారు విజయశాంతి.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
తాజావార్తలు
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!