దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నది. రోజువారీ కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 2,95,041 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,16,130కి చేరింది. ఇందులో 1,32,76,039 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 21,57,538 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,67,457 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో రికార్డ్ స్థాయిలో 2023 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,82,553కి చేరింది. ఇండియాలో ఇప్పటి వరకు 13,01,19,310 మందికి టీకా అందించారు.