రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 104 వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. 104 కు ఫోన్ చేసిన వెంటనే అవసరం మేరకు బెడ్‌లను ఇచ్చే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బెడ్లు అవసరం లేని వారిని కరోనా కేర్ సెంటర్లకు పంపాలని, ప్రతి ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రను తప్పనిసరిగా అమలు జరిగేలా…
మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుమారుని మృతి వార్త తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్న కన్న కొడుకు కరోనా వచ్చి చనిపోగా.. ఈరోజు తల్లితండ్రులు చనిపోవడంతో అందరి మనసులను కలిసివేసింది. వివరాల్లోకి వెళితే.. వంపుగూడకు చెందిన పిసరి హరీష్ రెడ్డి( 31) కరోనా సోకింది. కరోనా…
ఏపీకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ-టీఎస్ బోర్డర్ వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణలోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు టీఎస్ పోలీసులు. తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతి ఇస్తున్నారు టీఎస్ పోలీసులు. ఆసుపత్రుల అనుమతి లేకుండా కరోనా పేషేంట్ ను ఆసుపత్రిలో చేర్చడానికి వెళ్తున్న అంబులెన్స్ లను నిలిపివేస్తున్నారు టీఎస్ పోలీసులు. ఇందులో భాగంగానే జగ్గయ్యపేట బోర్డర్ దగ్గర…
ఇండియాలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సిన్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండియాలో కరోనా మహమ్మారికి అత్యవసర సమయంలో రెమ్ డెసివీర్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో సిప్లా ఫార్మా తయారు చేస్తున్నది. రెండు రోజుల క్రిత్రం రోచ్ సంస్థ తయారు చేసిన యాంటీబాడీ కాక్ టైల్ మెడిసిన్ ను కూడా ఇండియాలో సిప్లా కంపెనీ పంపిణి చేయబోతున్నది. ఇకపోతే, ఇప్పుడు మరో ఔషధానికి ఇండియాలో…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో మమేకమయ్యే ప్రజాప్రతినిధులు ఇటీవల కాలంలో ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేర్కొన్నారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కరోనా టెస్టులు…
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా దేశంలో మరో ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి కరోనా బారిన పట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పుదుచ్చేరిలో అన్నాడీఎంకే కూటమి విజయం సాధించింది. ఆ కూటమి నుంచి రంగస్వామిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. నాలుగురోజుల…
కరోనా కట్టడికి ప్రభుత్వాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. కరోనా మొదటి వేవ్ తగ్గుముఖం పట్టిన తరువాత ప్రదర్శించిన అలసత్వం, కరోనా నిబంధనలు పాటించకపోవడం వలనే సెకండ్ వేవ్ ఇంట ఉధృతంగా మారింది. సెకండ్ వేవ్ లో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. మరణాల రేటు కూడా అధికంగా ఉన్నది. ఇక థర్డ్ వేవ్ కూడా తప్పదని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, సెకండ్ వేవ్ సమయంలో ప్రదర్శించిన అలసత్వం ప్రదర్శిస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని, ఇప్పటికే…
కెసిఆర్ సర్కార్ పై మరోసారి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కారంటే గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరు అని మండిపడ్డారు. “తెలంగాణ సర్కారంటే గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరు అని సీఎం కేసీఆర్ గారు పదేపదే నిరూపిస్తున్నారు. రాష్ట్రాన్ని దాదాపు నెలన్నరగా కోవిడ్ సెకెండ్ వేవ్ తీవ్రస్థాయిలో వేధిస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఇప్పుడు ఒక ప్రణాళిక లేకుండా ఆదరాబాదరాగా ఏం తోస్తే అది చేస్తున్నారు. వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభం… సిబ్బంది…
ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆగంగేట్రం చేసిన యువ పేసర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ బారిన పడిన అతని తండ్రి ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఈ ఏడాది జనవరిలో సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదం నుంచి కుటుంబం కోలుకోకముందే కరోనా అతని తండ్రిని బలి తీసుకుంది. అయితే ఐపీఎల్ 2021 సీజన్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్…
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ అను అమలు చేస్తున్నారు. ఇటు ఒడిశా రాష్ట్రంలో కూడా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను విధించారు. దీంతో షాపులు, రెస్టారెంట్లు అన్ని మూతపడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారబోతున్నాయి. అయితే, వీధుల్లో తిరిగే జంతువులకు ఆహరం దొరక్క ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించిన ఒడిశా ముఖ్యమంత్రి వీధి జంతువుల…