మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుమారుని మృతి వార్త తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్న కన్న కొడుకు కరోనా వచ్చి చనిపోగా.. ఈరోజు తల్లితండ్రులు చనిపోవడంతో అందరి మనసులను కలిసివేసింది. వివరాల్లోకి వెళితే.. వంపుగూడకు చెందిన పిసరి హరీష్ రెడ్డి( 31) కరోనా సోకింది. కరోనా కారణంగా.. గత 20 రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచాడు హరీష్ రెడ్డి. అయితే కుమారుడు మృతి చెందిన 24 గంటలు గడవకముందే హరీష్ రెడ్డి తల్లిదండ్రులు గుండెపోటుతో మృతి చెందారు.