దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ అను అమలు చేస్తున్నారు. ఇటు ఒడిశా రాష్ట్రంలో కూడా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను విధించారు. దీంతో షాపులు, రెస్టారెంట్లు అన్ని మూతపడ్డాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారబోతున్నాయి. అయితే, వీధుల్లో తిరిగే జంతువులకు ఆహరం దొరక్క ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించిన ఒడిశా ముఖ్యమంత్రి వీధి జంతువుల ఆహరం కోసం సీఎం ఫండ్ నుంచి రూ.60 లక్షల రూపాయలను కేటాయించారు. రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లు, 48 మున్సిపాలిటీలు, 61 నోటిఫై ఏరియాల్లో వీధి జంతువుల ఆహరం కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయబోతున్నారు.