ఇండియాలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సిన్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇండియాలో కరోనా మహమ్మారికి అత్యవసర సమయంలో రెమ్ డెసివీర్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో సిప్లా ఫార్మా తయారు చేస్తున్నది. రెండు రోజుల క్రిత్రం రోచ్ సంస్థ తయారు చేసిన యాంటీబాడీ కాక్ టైల్ మెడిసిన్ ను కూడా ఇండియాలో సిప్లా కంపెనీ పంపిణి చేయబోతున్నది.
ఇకపోతే, ఇప్పుడు మరో ఔషధానికి ఇండియాలో అనుమతులు మంజూరు చేశారు. అమెరికాకు చెందిన ఎలిలిల్లీ అనే ఔషధ సంస్థ తయారు చేసిన బారిసిటీనిబ్ కు భారత్ లో అనుమతులు లభించాయి. దీనిని రెమ్ డెసివీర్ తో కలిపి అందిస్తారు. అత్యవసర వినియోగానికి ఇండియాలో అనుమతులు లభించడంతో ఈ మెడిసిన్ ను సిప్లా ఫార్మా కంపెనీ పంపిణి చేయబోతున్నది.