గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లతో జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశీలకులుగా వచ్చిన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్పీలు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం అయ్యారు.ఈ సందర్బంగా ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వారిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ విషయం చాలా…
గూగుల్ కంపెనీ కరోనా కాలంలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెపింది. కరోనా కాలంలో కూడా ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. దీని వలన వచ్చే ఇబ్బందులను గుర్తించిన గూగుల్ ఓ నిర్ణయం తీసుకుంది. వారంలో మూడు రోజులు ఆఫీస్ కు వచ్చి పనిచేయాలని, మిగిలిన రెండు రోజులు మీ ఇష్టం అని, ఆఫీస్ కు రావాలని అనిపిస్తే రావొచ్చని, లేదంటే ఇంటి నుంచే పనిచేయొచ్చని పేర్కొన్నది. ఆఫీస్ కి వచ్చే మూడు రోజులు కూడా…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా హైదరాబాద్ నగరంతో పాటుగా జిల్లాల్లోని చిన్న చిన్న మున్సిపాలిటీల్లో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని భుత్పూర్ మున్సిపాలిటీలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న తరుణంలో అక్కడి మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ పరిధిలో స్వచ్చంద లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ చైర్మన్ బస్వరాజు గౌడ్ పేర్కొన్నారు. ఈరోజు…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ విధించే విషయం గురించి సిఎం కెసిఆర్ లోతైన విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…..తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు కొన్ని దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మోడెర్నా కంపెనీ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం అమెరికాతో సహా కొన్ని దేశాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే, కరోనా మహమ్మారిపై మోడెర్నా సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో కొత్త స్ట్రెయిన్ ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని,…
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతున్నది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా నుంచి బయటపడేందుకు మాస్క్ ధరిస్తున్నా వైరస్ సోకుతూనే ఉన్నది. కరోనా మొదటి దశలో సింగిల్ మాస్క్ ధరించినా సరిపోయిందని, కానీ, ఇప్పుడు సెకండ్ వేవ్ భీభత్సంగా ఉండటంతో తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలని చెప్తున్నారు. లోపల సర్జికల్ మాస్క్ దానిమీద గుడ్డతో…
ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 4,14,188 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది. ఇందులో 1,76,12,351 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,45,164 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24గంటల్లో ఇండియాలో కరోనాతో 3915 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,34,083కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24…
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఢిల్లీని ఆక్సీజన్ కోరత వేధిస్తోంది. ఆక్సీజన్ కొరత కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఢిల్లీ ఆసుపత్రులకు ఆక్సీజన్ సరఫరాకు కొరత లేకుండా చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేగంగా ఆక్సీజన్ ట్యాంకర్లను తెప్పిస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో, ఢిల్లీ ఆసుపత్రుల్లో ఖాళీలు లేక హోమ్ ఐసోలేషన్‌లో వేలాదిమంది కరోనా రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి ఆక్సీజన్ అవసరమైన వారికి…
దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దక్షిణాదిన ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే కర్ణాటక రాష్ట్రంలో ఏకంగా 50 వేలకు పైగా కేసుకు నమోదయ్యాయి. ఆంక్షలు, మినీ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటివి విధించినా కరోనా ఏ మాత్రం కట్టడి కావడం లేదు. కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్యా కూడా పెరుగుతున్నది. రాజధాని బెంగళూరులో కేసులు నిన్న ఒక్కరోజు 23 వేలకు…
దేశంలో కరోనా పాజిటివిటి రేటు పెరిగిపోతున్నది. ముఖ్యంగా గోవాలో పాజిటివిటి రేటు 51శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.దేశంలోనే అత్యధిక పాజిటివిటి రేటు ఉన్న రాష్ట్రంగా గోవా రికార్డ్ కెక్కింది.కరోనా టెస్టులు చేస్తున్న ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్న కట్టడి కావడం లేదు. రోజు రోజుకు పాజిటివిటి రేటు పెరుగుతుండటంతో సంపూర్ణ లాక్ డౌన్ విధించడం ఒక్కటే మార్గం అని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. కొంతకాలం పాటు గోవా…