ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కంటే ఎక్కువగా కరోనా ఆలోచనలు జనాల్ని వెంటాడుతున్నాయి. దీనితో మరింత అనారోగ్యపాలవుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలు కేసు చేసుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా (62) రెండు సంవత్సరాలుగా విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గుప్తాకు భార్య…
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,20,709 కి చేరింది. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కరోనా బాధితులను అదుకునేందుకు “ఆపదలో తోడుగా YSSR”అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. “తెలంగాణ ఆడబిడ్డలారా.. ధైర్యం…
కాస్త పాజిటివ్ కేసులు తగ్గినా.. రికవరీ కేసులు పెరిగినా.. భారత్‌లో కరోనా విలయం మాత్రం కొనసాగుతూనే ఉంది.. సెకండ్ వేవ్‌లో ఇవాళ కూడా 3 లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి… అయితే, భారత్‌లో కరోనా మహమ్మారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఆందోళనర రీతిలో పెరుగుతున్నాయని.. ఆస్పత్రులపాలయ్యేవారి సంఖ్య కూడా పెరిగిపోయిందని.. కోవిడ్ బారినపడి మృతిచెందేవారి సంఖ్య కూడా అధికంగానే…
కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది.. ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది… ఇప్పుడు గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులను, సిబ్బందిని కరోనా టెర్రర్ వణికిస్తోంది… ఇప్పటికే గన్నవరం విమానాశ్రయంలో వివిధ శాఖల్లో పనిచేసే 30 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది మహమ్మారి బారినపడగా… ముగ్గురు మృతిచెందారు… దీంతో.. గన్నవరం విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.. ఇక, గన్నవరం విమానాశ్రయం లో…
ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 3,26,098 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,43,72,907 కి చేరింది. ఇందులో 2,04,32,898 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,73,802 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24గంటల్లో ఇండియాలో కరోనాతో 3,890 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,66,207 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే,…
తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ని రేపు, ఎల్లుండి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కొవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు 12 నుంచి 16 వారాల వ్యవధిలో ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం…
ఏపీ తెలంగాణ బోర్డర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను తెలంగాణ బోర్డర్‌లోనే అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో అత్యవసర చికిత్స అందక రోగులు మృతిచెందుతున్నారు. ఇలా బోర్డర్‌లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం మండిపడింది. ఇక, తెలంగాణ బోర్డర్లో అంబులెన్స్ లను అడ్డుకోవడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తరపుప అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు.…
చిన్న పిల్లలకు కరోనా సోకుతుందా వస్తే వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి. కరోనా సోకిన పిల్లలను ఎలా గుర్తించాలి అనే విషయాలపై కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. మొదటిదశలో కరోనా కేవలం 4శాతం మంది పిల్లల్లో కనిపించగా, సెకండ్ వేవ్ సమయంలో 15 నుంచి 20శాతం మంది పిల్లల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది. ఇది మూడో వేవ్ లో 80శాతం మంది పిల్లలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, తలనొప్పి,…
ఈనెల 8 వ తేదీన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయ్యింది. ఓ యువతి చేతికి సిలైన్, ముక్కుకు ఆక్సిజన్ పెట్టుకొని అత్యవసర బెడ్ మీద చికిత్స పొందుతూ కనిపించింది. ఐసీయూలో చేరాల్సి ఉన్నా బెడ్ దొరక్కపోవడంతో అత్యవసర వార్డులో ఆమెకు చికిత్స అందించారు వైద్యులు. సాధారణంగా ఈ పరిస్థితుల్లో ఉన్న రోజులు డీలాపడిపోయి మానసికంగా కృంగిపోయి ఉంటారు. కానీ, ఆ యువతి మాత్రం అలా కాదు. ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా మానసికంగా ధైర్యంగా ఉన్నది. …
తెలంగాణలో లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యి లాక్‌డౌన్‌ను విధించింది. బోర్డర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బోర్డర్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను హైదరాబాద్ కు వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లాలోని పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. దీంతో చెక్ పోస్టుల…