గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరే తెలంగాణ సర్కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెసిఆర్ సర్కార్ పై మరోసారి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కారంటే గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరు అని మండిపడ్డారు. “తెలంగాణ సర్కారంటే గత్తర బిత్తర గందరగోళానికి మారుపేరు అని సీఎం కేసీఆర్ గారు పదేపదే నిరూపిస్తున్నారు. రాష్ట్రాన్ని దాదాపు నెలన్నరగా కోవిడ్ సెకెండ్ వేవ్ తీవ్రస్థాయిలో వేధిస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఇప్పుడు ఒక ప్రణాళిక లేకుండా ఆదరాబాదరాగా ఏం తోస్తే అది చేస్తున్నారు. వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభం… సిబ్బంది నియామకం అంటూ ఆదేశాలిచ్చారు. పీఎంఎస్ఎస్‌వై కింద ఎంజిఎంలోను, రిమ్స్‌లో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణ వాటాగా ఇవ్వాల్సిన రూ.28 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఆజ్ఞాపించారు. ప్రజారోగ్యం పట్ల సీఎం గారికి అంత శ్రద్ధ ఉంటే… కరోనా పీడిస్తున్న గత ఏడాది కాలంలోనే ఈ పనులు ఎందుకు చెయ్యలేదు? రాజకీయాలు పక్కనపెట్టి ఈ ప్రారంభోత్సవాలు, నియామకాలు, నిధుల విడుదల కాస్త ముందుగానే చేసి ఉంటే ఇంత అయోమయం, కోర్టులతో మందలింపులు ఉండేవి కాదు కదా? మరోవైపు ఫలితంలేని నైట్ కర్ఫ్యూ మాత్రం పెట్టి పగటివేళ నియంత్రణ లేకుండా గాలికి వదిలేశారు. కోవిడ్ వ్యాప్తిలో అత్యంత ప్రమాదకరమైన బార్లు, పబ్‌లు, సినిమాహాళ్ళు, సభలు, సమావేశాలు తదితరాల విషయాన్ని పక్కనపడేసి కేవలం విద్యాసంస్థల్ని మాత్రమే మూయించి ఉపాధ్యాయులు రోడ్డున పడేలా చేశారు. ఇప్పుడు వీరికిస్తున్న పాతిక కేజీల బియ్యం… రూ.2 వేల ఆర్థిక సహాయాన్ని బార్లు, పబ్‌ల, సినిమాహాళ్ళ వారికి అందించి వాటిని మూయించి ఉన్నా…. లేదా ఇప్పటికైనా మూయిస్తే ఇన్ని ప్రాణాలు ప్రమాదం ముంగిట ఉండేవి కావేమో…” అంటూ విజయశాంతి ఎద్దేవా చేశారు.
Also Read
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!