కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు నేతలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో కంప్లైన్ట్ చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి మ్యుటెంట్ ఎన్ 440 కె వేరియంట్ కర్నూలు జిల్లాలో ఉందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారని చెప్పి వైసీపీ నేతలు కర్నూలు జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీ నేతలపై కంప్లైంట్…
దేశంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఒక్కొక్క రాష్ట్రం లాక్ డౌన్ విధిస్తు వస్తున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించాయి. ఈ బాటలో మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించే అవకాశం లేకపోలేదు. లాక్ డౌన్ సమయంలో అన్ని రంగాలు మూతపడుతున్నాయి. వ్యాపార సంస్థలు, షాపులు మూతపడుతున్నాయి. షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు అన్ని మూతపడుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క మందుబాబులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెరీ ఇబ్బందులను గుర్తించిన…
దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం “లాక్ డౌన్” పొడిగించారు సిఎం కేజ్రీవాల్. ఈ నెల 17 వరకు ఢిల్లీలో లాక్ డౌన్ ఉండనుందన్నారు. ఇక నుంచి కఠినమైన “లాక్ డౌన్” నిబంధనలు అమలు చేస్తామని… మే 10 వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులు రద్దు కానున్నాయని సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు. “మెడికల్ ఆక్సిజన్” అందుబాటు పరిస్థితి నిలకడగా ఉందని… దేశ రాజధానిలో కొత్తగా 17,364 “కోవిడ్” కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. 24…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ, మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే, ఆదివారం కావడంతో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి కనిపించడం లేదు. దీంతో ఆదివారం రోజున ఆంక్షలను కఠినంగా అమలు చేస్తే కొంతమేర ఫలితం కనిపిస్తుందని శ్రీకాకుళం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళంలో ఈరోజు సంపూర్ణ లాక్…
ఉత్తర ప్రదేశ్ లో మరోసారి లాక్ డౌన్ ను పొడిగించారు. ఇప్పటికే రెండుసార్లు లాక్ డౌన్ ను పొడిగించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 17 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ ను అమలు చేసి కరోనాను సమర్ధవంతంగా కంట్రోల్ చేసింది…
భారత్ లో కరోనా మహమ్మారి ఎంతగా విజృంభిస్తోందో చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అటు గుజరాత్ కు చెందిన జైకోవ్ డి వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇక ఇదిలా ఉంటె ఇప్పుడు మరో ఔషధాన్ని ఇండియా డ్రగ్స్ కంట్రోల్ అనుమతులు మంజూరు చేసింది. యాంటీబాడీ కాక్ టైల్ ఔషధం త్వరలోనే ఇండియాకు దిగుమతి కానున్నది. ఈ ఔషధాన్ని గతంలో ట్రంప్ వినియోగించారు. అమెరికా అధ్యక్ష…
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయి. కరోనా నుంచి విజయవంతంగా కోలుకున్న వ్యక్తుల్లో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ కారణంగా కంటి చూపు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. సూరత్ లో ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి. బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తులకు వైద్యం చేయడం కష్టంగా మారిందని, ఖర్చుతో కూడుకొని ఉండటంతో అందరికి అందుబాటులో ఉండటం లేదని సూరత్ వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ బారిన పడిన బాధితులు…
దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈరోజు కూడా నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామాల్లో కూడా వణికిస్తోంది. గ్రామాల్లోని ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రుల వద్ద పెద్ద సంఖ్యలో కరోనా రోగులు కనిపిస్తున్నారు. అయితే, గుజరాత్ లోని మోహ్సహా జిల్లాలోని బేచరాజీ మండలంలో చాందిని అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలోని యువకులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస…
వాక్సినేషన్ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కొవిడ్ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు వెల్లడించింది సర్కార్. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. రెండో డోస్ వాళ్లకు ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం. పోర్టల్ లో సమస్య ఉంది.. దాని కోసం కేంద్రాన్ని.. సాఫ్ట్వేర్ లో…
దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక దక్షిణభారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో పరిస్థతి వేరుగా ఉన్నది. రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క బెంగళూరు నగరంలోనే ఏకంగా 25 వేలకు పైగా కేసులు, 200 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని, లేదంటే కర్ణాటక రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తెలియజేసింది.…