ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఈడీకి లేఖరాశారు సోనియా గాంధీ.. విచారణను ప్రస్తుతం వాయిదా వేయాలని అభ్యర్థించారు.. ఈడీ ముందు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని లేఖలో కోరారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ..
ఇటీవల దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. అక్కడ కోహ్లీ తన కుటుంబంతో బాగా ఎంజాయ్ చేశాడు. వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోహ్లీ కరోనా పాజిటివ్ బారిన పడినట్లు ఓ జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఓ టెస్ట్, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం కొద్దిరోజుల కిందట టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా సభ్యులు జోరుగా షికారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట రోహిత్, కోహ్లి షాపింగ్ అంటూ లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. యూకేలో కరోనా తీవ్రత…
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. కోవిడ్ అనంతర సమస్యల కారణంగా ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన సోనియా.. దాదాపు వారం తర్వాత ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేష్.. ఈ సాయంత్రం సర్ గంగారామ్ ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారని మరియు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొంటూ ట్వీట్ చేశారు…
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలం నుంచి తగ్గుతూ వస్తున్న కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పది రోజుల క్రితం వరకు రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేలకు దిగువనే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య 10 వేలను దాటుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరుగుతోంది. దీంతో మళ్లీ ప్రజల్లో కరోనా భయాలు నెలకొన్నాయి. ఫోర్త వేవ్ తప్పదా..? అనే అనుమానాలు…
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ మహమ్మారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి దేశంలో కేవలం 2,3 వేలకు పరిమితం అయిన రోజూవారీ కేసులు సంఖ్య తాజాగా 12 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,216 మంది వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 68,108గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మహమ్మారి బారిన పడి మరో…
ఆరు నెలల పసికందు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలల వయసున్న చిన్నారులకూ ఫైజర్, మోడర్నా కంపెనీల కరోనా టీకాలు వేసేందుకు తాజాగా అనుమతిచ్చింది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు శుక్రవారం ఆమోదం లభించింది. . టీకాలు ఎలా ఇవ్వాలన్న దానిపై…