కరోనా మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. దేశంలో మరోసారి కరోనా కేసులు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఒక్క రోజు వ్యవధిలోనే ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. తాను కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా…
కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటే వేరియంట్ల మీద వేరియంట్లు పుట్టుకొచ్చి భయపెడుతున్నాయి. దేశంలో తాజాగా రెండు కొత్త వేరియంట్లకు సంబంధించి కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఉద్ధృతి దేశంలో కాస్త తగ్గింది. కేసులు కూడా గతంతో పోలిస్తే బాగా తగ్గాయ్. అయితే ఒమిక్రాన్‌కు సంబంధించిన వేరియంట్లు ఒక్కొక్కటిగా బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పూణేలో బీఏ4, బీఏ5 కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.…
కరోనా పుట్టినిల్లు డ్రాగన్ దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు భయపెడుతున్నాయి.. చైనా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా… కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్ మరోసారి కఠిన ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయింది. చైనాలో కొత్తగా 157 కోవిడ్ కేసులు నమోదుకాగా.. వీటిలో 52 బీజింగ్‌లోనే వెలుగు చూశాయి. జీరో కోవిడ్ పాలసీకి అనుగుణంగా ఆదివారం నుంచి నగరంలో లాక్‌డౌన్ అమలు చేశారు. దీంతో మరిన్ని నగరాలు లాక్‌డౌన్ పరిధిలో వెళుతున్నాయి. హయిడియన్, చావోయాంగ్, ఫెంతాయ్, షన్‌యి,…
ఇండియాలో కరోనా కేసులు తక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజూ వారీ కేసుల సంఖ్య కూడా మూడు వేలకు లోపే నమోదు అవుతున్నాయి. అయితే ఇటీవల మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. చైనా, హాంకాంగ్, నార్త్ కొరియా, సౌత్ కొరియా వంటి దేశాల్లో ఇటీవల కరోనా కేసులు పెరిగినా… ఇండియాలో మాత్రం గత ఫిబ్రవరి నుంచి కేసుల తీవ్రత ఎక్కువగా లేదు. ఇదిలా ఉంటే తాజాగా…
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి టెస్ట్ చేసే.. వైరస్ సోకిందా? లేదా? అని నిర్ధారిస్తున్నారు.. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్‌గా తేలుతుంది.. అయితే, ఇప్పుడు జాగిలాలను రంగంలోకి దింపారు… హత్య కేసులు, ఇతర కేసుల్లో నిందితుల గుర్తింపు కోసం జాగిలాలను ఉపయోగించడం చూశాం.. సెక్యూరిటీ చెక్స్‌లోనూ జాగిలాలను ఉపయోగిస్తుంటారు.. ఇప్పుడు కోవిడ్ సోకినవారిని గుర్తించేందుకు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు.. ఫిన్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి పరిశోధకులు- నాలుగు జాగిలాలకు…
ఉత్తర కొరియా అంటేనే మిస్టరీ దేశం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా వెలుగు చూడలేదు. నిజానికి కరోనా కేసులు నమోదైనా కూడా తమ దేశంలో ఒక్క కేసు కూడా రాలేదని కిమ్ ప్రభుత్వం గొప్పలకు పోయింది. అయితే తాజాగా ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదైన కొన్ని గంటల్లోనే ఆ దేశంలో తొలి కరోనా మరణం కూడా సంభవించింది. ప్యాంగాంగ్‌లో తాజాగా జ్వరంతో ఆరుగురు ప్రాణాలు…
దేశంలో కరోనా నాలుగో వేవ్ రాకపోవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వైరస్ సోకడంతో ప్రజలకు సహజ రోగనిరోధక శక్తి లభించింది. ఐఐటీ కాన్పూర్ సూత్ర మోడల్ ప్రకారం… 90 శాతం మంది భారతీయులకు ఈ సహజ నిరోధకత లభించినట్లు వెల్లడించింది. ఇటీవల కేసులు పెరిగినా… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తే, నాలుగో వేవ్‌కు అవకాశం ఉంటుంది. అంతేకానీ… వైరస్ తీవ్రతను తగ్గించుకునేందుకు టీకా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. Read Also:…
కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం ఎంతో.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన కోవిడ్.. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది.. వైద్య రంగంలోని లోటును కళ్లకు కట్టింది.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహమ్మారి బారినపడి కోలుకోగా.. దాదాపు కోటిన్నర మంది ప్రాణాలు వదిలారు. కరోనా కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు విడిచినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్)వో ప్రకటించింది. దేశాలవారీగా వివరాలను కూడా వెల్లడించింది.. భారత్‌లో కోవిడ్ మరణాలు 47 లక్షలని…
దేశంలో కరోనా కేసులు… మళ్లీ పెరుగుతున్నాయి. కొంతకాలంగా బాగా తగ్గిన పాజిటివిటీ రేటు… అనూహ్యంగా పెరుగుతోంది. ఇక, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌ఈ మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. అత్యంత సాంక్రమిక శక్తి ఉన్నట్లు భావిస్తోన్న… ఈ వేరియంట్ గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. తాజాగా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే ల్యాబొరేటరీల ఇన్సాకాగ్… ఎక్స్‌ఈ వేరియంట్‌పై క్లారిటీ ఇచ్చింది. BA.2.10, BA.2.12.. BA.2 ఉప రకాలుగా గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. BA.2 పాత సీక్వెన్సులే కొత్త వాటిగా…
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినా..అక్కడక్కడా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలంటున్నారు నిపుణులు. ఇదిలా వుంటే పిల్లల వ్యాక్సినేషన్ సురక్షితమేనని నిపుణులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తన కీలక తీర్పు వెల్లడించింది. నిపుణులు తమ అభిప్రాయం చెప్పాక తాము నిర్ణయాన్ని వెలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో పిల్లలకు కొవిడ్ టీకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. శాస్త్రీయ ఏకాభిప్రాయం, ప్రపంచ సాధికార సంస్థల సూచనలకు అనుగుణంగానే ఉన్నట్లు…