దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ మహమ్మారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి దేశంలో కేవలం 2,3 వేలకు పరిమితం అయిన రోజూవారీ కేసులు సంఖ్య తాాజాగా పదివేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,847 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,063గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మహమ్మారి బారిన పడి 14 మంది…
కరోనా తగ్గుముఖం పడుతుందన్న సమయంలో.. చిన్నారులను పోస్ట్ కొవిడ్ లక్షణాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల్లో 700 మంది పిల్లలు అక్యూట్ హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ వ్యాధితో పదిమంది పిల్లలు ప్రాణాలుకూడా కోల్పోయారు. ఈ అక్యూట్ హెపటైటిస్‌కు సంబంధించిన మొదటికేసు యూకేలో మొదటిసారి బయటపడింది. ఈ ప్రమాదకర కాలేయ వ్యాధికి కారణం అంతుచిక్కడం లేదు. సాధారణంగా హెపటైటిస్‌కు హెపటైటిస్- ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు వైరస్‌లు కారణమవుతాయి.…
దేశంలో వైద్య ఆరోగ్య రంగానికి మోడీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే. కోవిడ్ వచ్చే సమయానికి దేశంలో ఆస్పత్రులు పరిస్థితి అంత మెరుగ్గా లేదు. రెండేళ్లలో దేశంలోని ఆసుపత్రులలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. వైద్య రంగానికి ప్రధానమంత్రి మోడీ పెద్ద పీట వేశారన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే కోవిడ్ మరణాలు దేశంలో తక్కువ అన్నార. కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు…
మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.. దానికి వ్యాక్సినేషన్‌తోనే చెక్ పెట్టాలని అనేక పరిశోధనలు తేల్చాయి.. దీంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.. భారత్‌లోనూ భారీ సంఖ్యలో వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది.. కొన్ని దేశాల్లో మందకొడిగానే ఉంది. మరోవైపు, కొత్త వేరియంట్లు, కొత్త వేవ్‌లో పుట్టుకొస్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. కరోనా వేవ్‌లు, బూస్టర్ డోస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్.. 4-6 నెలలకు ఒక…
ఏపీలో వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల పై సీఎం జగన్ అధికారులను వివరాలు కోరారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పై సీఎం ఆరా తీశారు. రాష్ట్రంలో కోవిడ్ 19 పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు అధికారులు. 18 సంవత్సరాల్లోపు వారికి కూడా రెండు డోసులు దాదాపుగా పూర్తయ్యాయి.…
కరోనా మహమ్మారి వెలుగు చూసిననాటి నుంచి దానిపై అనేక అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మహమ్మారి సోకినవారిలో జరిగే పరిణామాలు.. కోవిడ్ నుంచి కోలుకున్నతర్వాత వచ్చే మార్పులు.. ఇలా అనేక రకాలుగా పరిశోధనలు చేశారు.. చేస్తూనే ఉన్నారు.. అయితే, కోవిడ్ బారినపడిన తర్వాత చాలామంది పిల్లల్లో ప్రాణాంతక మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్-సీ) కనిపించినట్టు మరో కొత్త స్టడీ తేల్చింది. ఇది, వ్యాక్సినేషన్ వేసుకోని పిల్లలతోపాటు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా కనిపించిందని చెబుతున్నారు.. Read Also:…
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఫోర్త్ వేవ్ కు దారి తీస్తాయా.? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల మూడు నాలుగు రోజుల నుంచి వరసగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో గరిష్ట రోజూవారీ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం దేశంలో 3000కు లోపలే కరోనా కేసులు ఉంటే.. ప్రస్తుతం మాత్రం కేసుల సంఖ్య 7 వేలను దాటింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలు…
తగ్గినట్టే తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి.. దేశవ్యాప్తంగానే కాదు.. తెలంగాణలోనూ కోవిడ్ రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ పైకి కదులుతోంది. అయితే, కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో రెగ్యులర్ ఫ్లూస్‌తో లక్షణాలతో పాటు జ్వరం, తలనొప్పి, స్మెల్ లేకపోవడం ఉంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని స్పష్టం చేసింది.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 66 శాతం…
ప్రస్తుతం బాలీవుడ్ ను కరోనా పట్టి పీడిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది స్టార్లు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కరోనా బారిన పడిన విషయం విదితమే.. ఇక తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కూడా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మే 25 న షారుఖ్, అతని భార్య గౌరీ ఖాన్ సైతం కరణ్ జోహార్…