ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 18,767 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,80,827కి చేరింది. ఇందులో 13,61,464 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,09,237 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 104 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 10,126కి చేరింది. అనంతపురంలో 1846,…
కరోనా కష్టకాలంలో సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు సినీ ప్రముఖులు. కరోనా కారణంగా ఆక్సిజన్ అవసరం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ అందక పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ పాప్ సింగర్ స్మిత ముందుకొచ్చింది. పలు కోవిడ్ సెంటర్లలో మొత్తంగా కలిపి 100 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసింది. వాటి ఏర్పాటు పూర్తయినట్లు, తాను అనుకున్న లక్ష్యం నెరవేరినట్లు వెల్లడిస్తూ, పడకలకు సంబంధించిన ఫొటోలను స్మిత ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగమైన…
మాస్క్ ధరించడం వలన కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మాస్క్ లేకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించడం వలన వైరస్ లోనికి ప్రవేశించలేదని చెప్తున్నారు. అయితే, ఇప్పుడు అదే మాస్క్ వలన బ్లాక్, వైట్ ఫంగస్ వంటివి సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ను ఎక్కువ రోజులు వాడటం వలన, శుభ్రం చేసుకోకుండా మాస్క్ ను వినియోగించడం వలన అందులో మ్యూకోర్ మైకోసిస్ అనే ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని, ఈ…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని, మనుషుల జీవితాలను ఎలా మార్చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా మహమ్మారి బారిన పడి ఎలాగోలా కోలుకున్నా, బ్లాక్ ఫంగస్ వంటి రోగాలు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కరోనా బారిన పడిన వ్యక్తుల్లో చాలా మంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. బ్లాక్ ఫంగస్ కు అందించాల్సిన వైద్యం ఖరీదు కావడం, ఇంజెక్షన్లు తగినన్ని అందుబాటులో లేకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక బ్లాక్ ఫంగస్ తో పాటుగా వైట్ ఫంగస్ కూడా విజృంభిస్తోంది. అయితే,…
ప్రముఖ నటుడు అలీ, జుబేదా దంపతులు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్‌కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 శాఖల్లోని సభ్యులందరూ కరోనా కారణంగా షూటింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిని ఎంతో కొంత ఆదుకునే ఉద్ధేశ్యంతో అలీ ముందుకు వచ్చి పదికిలోల బియ్యం, నూనె, గోదుమపిండి, చక్కెరలతో పాటు 8 రకాలైన సరుకులను వారికి అందించారు. ఈ సందర్భంగా…
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో కొంతమేర కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివిటి రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు లాక్ డౌన్ ను సడలిస్తే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు లాక్ డౌన్ అమలులో…
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇవాళ తన నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. మాల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీని 50 పడకల కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసి చికిత్స అందించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్‌సీని దతత్త తీసుకున్న రేవంత్ రెడ్డి…నియోజకవర్గ ప్రజలకు కోరనా చికిత్స…
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు యూఎస్ మూడు రకాల వ్యాక్సిన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. 35 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో దాదాపుగా 25 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. ఇందులో 12 కోట్ల మందికి రెండు డోసులు అందించగా, 16 కోట్ల మందికి కనీసం మొదటి డోసును అందించారు. అయితే, ఏప్రిల్ 1 తర్వాత యూఎస్ లో వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య క్రమంగా…
హైదరాబాద్ లో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండటంతో, రోడ్లపైకి ఎవర్ని అనుమతించడం లేదు. రోడ్లపైకి అనవసరంగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు కఠినంగా హెచ్చరించారు. పోలీసులు రూల్స్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుండటంతో వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడేకంటే ఇంట్లోనే ఉండటం మంచిది అని చెప్పి బయటకు రావడం లేదు. దీంతో రోడ్లు బోసిపోయాయి.