కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇవాళ తన నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. మాల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీని 50 పడకల కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసి చికిత్స అందించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్‌సీని దతత్త తీసుకున్న రేవంత్ రెడ్డి…నియోజకవర్గ ప్రజలకు కోరనా చికిత్స అందించేందుకు తన సొంత నిధులు, ఎంపీ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 20 రోజుల క్రితం పనులు ప్రారంభం అయ్యాయి. 50 ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంతో కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడి నుంచే నియోజకవర్గ ప్రజలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుందని.. త్వరలో 100 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.