దేశంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనాతో పోరాడుతున్నారు. ఇలాంటి ఆపద సమయంలో చాలా మంది తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు సాయంగా నిలిచేందుకు కోరమాండల్ ఫర్టిలైజర్స్ సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.1 కోటి విరాళం ప్రకటించింది. కోరమాండల్ ఫర్టిలైజర్స్ ఎండీ సమీర్ గోయల్, వైస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ ఇవాళ హైదరాబాద్ ప్రగతి భనవ్ లో సీఎం కేసీఆర్ ను కలిసి విరాళం చెక్ ను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 15,284 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,09,105 కు చేరింది. ఇందులో 14,00,754 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,98,023 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 106…
కరోనా కష్టకాలంలోనూ ప్రైవేట్ ఆస్పత్రులు కనికరం చూపడంలేదు.. అందినకాడికి దండుకునే ప్రయత్నమే తప్పితే.. జాలిచూపే పరిస్థితిలేదు.. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కరోన కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ వేశారు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రజలకు అవుతున్న ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్న ఆయన.. ఆంద్రప్రదేశ్,…
10 రోజుల తాత్కాలిక బ్రేక్ తర్వాత తెలంగాణలో ఇవాళ్టి నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైందే.. ఇక, ఇదే సమయంలో.. వ్యాక్సినేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్ స్పైడర్స్ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరా చేసేవారు, రేషన్ దుకాణాల డీలర్లు, పెట్రోల్ పంపుల వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లు, కూరగాయలు, పండ్లు, పూలు, నాన్‌వెజ్ మార్కెట్లు, కిరాణా…
కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. మొత్తం 50 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 25 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా వ్యాక్సిన్ పూర్తిచేసినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొన్నది. తాజా డేటా…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చైనాలోని యువాన్ ప్రావిన్స్ లో ఉన్న గుహలు కారణం అని ప్రపంచం భావిస్తోంది. ఆ గుహల నుంచి వైరస్ ఊహాన్‌కు అక్కడి నుంచి ప్రపంచానికి విస్తరించినట్టు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం యునాన్‌లో ఉన్న గుహలను పూర్తిస్థాయి భద్రత కల్పించిది చైనా. ఎవరిని అటువైపు వెళ్లనివ్వడంలేదు. చైనా అద్యక్షుడి అనుమతి ఉన్న పరిశోధకులకు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఉంది. ఇక చైనా పరిశోధకులు…
గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో కమిషనరేట్ పరిధిలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధులు దాటాలంటే తప్పనిసరిగా పాసులు ఉండాలని పోలీసులు స్ఫష్టంచేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో పాసులు లేని వారిని కమిషనరేట్ సరిహద్దులు దాటనివ్వడం లేదు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఏ కమిషనరేట్‌లో లిమిట్ దాటాలన్నా పాసులు ఉండాలని, అత్యవసర సర్వీసులు, ఎసెన్సియల్ సర్వీసుల వారికి మాత్రమే పాసులు లేకుండా అనుమతులు ఉంటాయని పోలీసులు స్ఫష్టం చేస్తున్నారు.…
భారత్ లో కొనసాగుతున్న రెండవ విడత “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా 9వ రోజు 3 లక్షలలోపు రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య నమోదయింది. అయితే.. పాజిటివ్ కేసులు తగ్గినా…“కరోనా” మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,96,427 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,69,48,874 కి చేరింది. ఇందులో 2,40,54,861 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 25,86,782 కేసులు…
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. జిల్లాలో ఒక్కరోజులో రికార్డ్ స్టాయిలో 15 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో 9 కేసులు, స్విమ్స్ ఆసుపత్రిలో 6 కేసులు నిర్ధారణ జరిగింది. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 33 కి చేరింది. తిరుపతి రుయాలో 21, స్విమ్స్ లో 12 కేసలకు చికిత్స జరుగుతున్నది. ఇక ఇదిలా ఉంటే,…
కరోనా మహామ్మారిని ఎదుర్కోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మెడిసిన్ ఇప్పుడు సంచటనంగా మారగా, తెలంగాణలో మంథనీకి చెందిన గోశాల నిర్వాహకులు రమేష్ సరికొత్త ప్రయోగం చేశారు. అడవిలో తిరిగే అవుల నుంచి సేకరించిన ఆవుపేడ పిడకలు, నెయ్యి, ఆవాలు, కర్పూరం, పసుపు వేసి కాల్చాలి. దాని నుంచి వచ్చే పోగను గదిలో వేయడం వలన గదిలో ఉన్న కరోనా వైరస్ చనిపోతుందని, గాలిలో ప్రాణవాయువు పెరుగుతుందని…