మాస్క్ ధరించడం వలన కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మాస్క్ లేకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించడం వలన వైరస్ లోనికి ప్రవేశించలేదని చెప్తున్నారు. అయితే, ఇప్పుడు అదే మాస్క్ వలన బ్లాక్, వైట్ ఫంగస్ వంటివి సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ను ఎక్కువ రోజులు వాడటం వలన, శుభ్రం చేసుకోకుండా మాస్క్ ను వినియోగించడం వలన అందులో మ్యూకోర్ మైకోసిస్ అనే ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని, ఈ మ్యూకోర్ మైకోసిస్ బ్లాక్ ఫంగస్ గా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజు శుభ్రమైన మాస్క్ ను వినియోగించాలని, ఎలాంటి మాస్క్ అయినప్పటికీ రెండు వారాలకు మించి వాడకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. గుడ్డ మాస్కులను ఏరోజుకారోజు శుభ్రంగా ఉతుక్కొని వినియోగించుకోవాలని వైద్యనిపుణులు పేర్కొన్నారు. కరోనా ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో ఎక్కువ మొత్తంలో ఉత్పేరకాలను తీసుకోవడం వలన కూడా బ్లాక్ ఫంగస్ సోకుతున్నట్టు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.