ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 18,767 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,80,827కి చేరింది. ఇందులో 13,61,464 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,09,237 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 104 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 10,126కి చేరింది. అనంతపురంలో 1846, చిత్తూరులో 2323, ఈస్ట్ గోదావరి 2887, గుంటూరులో 1249, కడపలో 883, కర్నూలులో 1166, నెల్లూరులో 1045, ప్రకాశంలో 1162, శ్రీకాకుళంలో 971, విశాఖపట్నంలో 1668, విజయనగరం 821, పశ్చిమ గోదావరిలో 1972 కేసులు నమోదయ్యాయి.