ప్రొడక్షన్ లేడీస్‌కి నటుడు అలీ కుటుంబ సమేతంగా సహాయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు అలీ, జుబేదా దంపతులు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్‌కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 శాఖల్లోని సభ్యులందరూ కరోనా కారణంగా షూటింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిని ఎంతో కొంత ఆదుకునే ఉద్ధేశ్యంతో అలీ ముందుకు వచ్చి పదికిలోల బియ్యం, నూనె, గోదుమపిండి, చక్కెరలతో పాటు 8 రకాలైన సరుకులను వారికి అందించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ–‘‘ ప్రతిరోజూ మేము షూటింగ్‌లకు వెళ్లే ముందే ఈ ప్రొడక్షన్ యూనియన్‌లోని ఆడవాళ్లు చాలా ముందుగా షూటింగ్ స్పాట్‌లకు వెళతారు. ఆ తర్వాత వీళ్లు షూటింగ్‌లో పనిచేసే అందరు తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ కష్ట సమయంలో షూటింగ్‌లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలిసింది. అందుకే ఈరోజు నేను దాదాపు 2లక్షల రూపాయల ఖర్చుతో ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు అలీ. ఈ కార్యక్రమంలో నటుడు ఖయ్యూం, కరీమ్‌లు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?