హైదరాబాద్ లో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండటంతో, రోడ్లపైకి ఎవర్ని అనుమతించడం లేదు. రోడ్లపైకి అనవసరంగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు కఠినంగా హెచ్చరించారు. పోలీసులు రూల్స్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుండటంతో వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడేకంటే ఇంట్లోనే ఉండటం మంచిది అని చెప్పి బయటకు రావడం లేదు. దీంతో రోడ్లు బోసిపోయాయి.