ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని నిపుణులు ముందస్తుగా హెచ్చరించడంతో ఆయా రాష్ట్రాలు ఆ ఎఫెక్ట్ ను తట్టుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే, థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పిల్లలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. పిల్లలపై ఏ మేరకు దీని ప్రభావం ఉంటుంది అనే దానిపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కొన్ని కీలక విషయాలను పేర్కొన్నారు. థర్డ్ వేవ్ ఎఫెక్ట్…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు వల్ల హాని లేదని ఆయుష్ డైరెక్టర్ రాములు అధికారికంగా ప్రకటించారు. ఆనందయ్య ఆ మందు తయారీలో 18 మూలికలను ఉపయోగిస్తున్నారని, వాటిని దగ్గరుండి పరీక్షించి నిర్ధారించుకున్నామని ఆయన చెప్పారు. అవన్నీ ఇంట్లోనూ మనచుట్టూ దొరికేవేననీ, అయితే వాటి మిశ్రమంలో వచ్చే ప్రభావం ఏమిటో మాత్రం అధ్యయనం చేయాలని తెలిపారు. ఇక, దాన్ని ఆయుర్వేద ఔషధంగా పరిగణించలేమని, అందుకు సంబంధించిన యాభై గ్రంథాల్లో ఈప్రసక్తి లేకపోవడం ఇందుకు కారణమని స్పష్టం…
కరోనా కట్టడి చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని,…
కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు.. ఎంతోమంది కరోనా రోగులను నయం చేసింది.. దీంతో.. క్రమంగా అటు పరుగులు పెట్టారు జనం.. అయితే, ఎప్పుడైతే.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం మొదలైందో.. అప్పటి నుంచి మందు పంపిణీ నిలిచిపోయింది.. ఇక, ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ పరిశోధన చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఆయుష్ కమిషనర్ రాములు… ఇవాళ ఆనందయ్య మందుపై నివేదికను ఏపీ సీఎం వైఎస్…
కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికీ భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది.. రోజువారి పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నా.. మృతుల సంఖ్య ఇంకా భారీగానే నమోదు అవుతోంది.. ఇదే సమయంలో థర్డ్ వేవ్‌పై పెద్ద చర్చే జరుగుతోంది.. ఇది ముఖ్యంగా చిన్నారులను టార్గెట్ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అయితే, దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. క్లారిటీ ఇచ్చింది. కరోనా వైరస్ మ్యుటేట్ కావడం ద్వారా థర్డ్ వేవ్‌లో చిన్నారులను ప్రభావితం చేస్తుందనే సంకేతాలు ఇప్పటివరకూ వెల్లడికాలేదని.. థర్డ్ వేవ్…
కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర భవనాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న ఆయన.. వాటి గుర్తింపు బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు అప్పగించినట్టు తెలిపారు. ఇక, ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణ బాధ్యత సర్పంచులదేనని స్పష్టం చేసిన మంత్రి.. ఆయా గ్రామాల్లో కరోనా కేసుల…
అమెరికాలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్‌ను వేగవంతంగా అందిస్తున్నారు. దీంతో అమెరికాలో కేసులు తగ్గుముఖంపట్టాయి. ఇక ఇదిలా ఉంటే, వైట్‌హౌస్‌లో చాలా కాలం తరువాత అధికారులు మాస్క్ లు లేకుండా తిరుగుతూ కనిపించారు. అటు అధ్యక్షుడు జో బైడెన్, ఉపాద్యక్షురాలు కమలా హ్యారిస్‌తో సహా అందరూ మాస్క్ లను పక్కన పెట్టి కరచాలనం, ఆలింగనం చేసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. ఆరడుగుల దూరం పక్కనపెట్టి మునుపటి మాదిరిగా ఒకరికోకరు…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, ఇప్పుడు మరో కొత్త సమస్య రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతుండటం ఆంధోళన కలిగిస్తుంది. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. ఆర్మూర్ డివిజన్‌లో 8 మందికి ఈ వ్యాది నిర్ధారణ జరిగింది. నవీపేటలో 24 గంటల వ్వవధిలో…
మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రిలో దందా కూడా ఎక్కువే అవుతుంది. రీసెంట్ గా బ్లాక్ లో అధిక ధరలకు మందులు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన మంచిర్యాల పోలీసులు.. తాజాగా రహస్యంగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. జిల్లాలో ప్రైవేటు ల్యాబ్ లు డయాగ్నస్టిక్ లలో అనుమతి లేకుండా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. బాధితుల వద్ద నుండి ఒక్కో కోవిడ్ టెస్ట్ కు 3…