కరోనా కష్టకాలంలో సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు సినీ ప్రముఖులు. కరోనా కారణంగా ఆక్సిజన్ అవసరం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ అందక పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ పాప్ సింగర్ స్మిత ముందుకొచ్చింది. పలు కోవిడ్ సెంటర్లలో మొత్తంగా కలిపి 100 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసింది. వాటి ఏర్పాటు పూర్తయినట్లు, తాను అనుకున్న లక్ష్యం నెరవేరినట్లు వెల్లడిస్తూ, పడకలకు సంబంధించిన ఫొటోలను స్మిత ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా గత ఏడాది స్మిత, ఆమె భర్త శశాంక్కు కరోనా వైరస్ సోకింది. కోలుకున్న తరువాత ఆమె ప్లాస్మా దానం చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి.
Ever grateful to my team 🙏🏼 they hv never let me down. Without thinking abt how challenging it would be, I end up taking responsibilities small & big whenever I c a need. If nt fr them, all my dreams would hv just remained dreams. Turning our 100 bed oxygen support to reality 💪🏼 pic.twitter.com/uh4xgvtZPC
— Smita (@smitapop) May 23, 2021