కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు వారం ,10 రోజుల పాటు బ్రేక్ పడింది. ఇక అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి , మందు పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు పోలీసులు. మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి అక్కడున్న మందు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. త్వరలో ప్రభుత్వమే మ౦దు పంపిణీ చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వ అనుమతులు లభించే ఛాన్స్ ఉంది. ఇవాళ కృష్ణపట్నంకు ఐసీఎంఆర్ టీమ్ రానుంది. ఇప్పటికే…
కోవిడ్ –19 చికిత్సలో వాడే మందులను నాట్కో ట్రస్టు తరపున ఉచితంగా అందిస్తామని సీఎం వైయస్ జగన్‌కు నాట్కో ఫార్మా లిమిటెడ్ లేఖ రాసింది. కోవిడ్ –19 చికిత్సలో వాడే బారిసిటినిబ్–4 ఎంజీ (బారినట్) టాబ్లెట్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు లేఖలో పేర్కొంది నాట్కో ట్రస్టు. సుమారు లక్ష మంది కోవిడ్ పేషెంట్లకు ఈ టాబ్లెట్లు సరఫరా చేయనున్నట్టు తెలిపింది నాట్కో ఫార్మా లిమిటెడ్. రూ.4 కోట్ల 20 లక్షలు మార్కెట్ ఖరీదు చేసే టాబ్లెట్స్‌ను ప్రభుత్వ ఆసుపత్రులు,…
కరోనా సమయంలో కొంతమంది అయినవారు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.. ఆదుకోవడానికి ముందుకు రావడం తర్వాత సంగతి.. కనీసం పలకరించడానికి కూడా వెనుకడుగే వేస్తున్నారు.. అయితే, ఈ సమయంలో మానవత్వం చాటుకున్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు నేరుగా ఫోన్ చేసి మేం ఉన్నామంటూ భరోసా కల్పించారు.. హైదరాబాద్‌లోని సైదాబాద్ ఎబ్బీఐ కాలనీకి చెందిన దంపతులు కరోనాత మృతిచెందారు.. ఈ నెల 13వ తేదీన భర్త జగదీష్ కన్నుమూస్తే.. 18వ తేదీన భార్య గీత ప్రాణాలు వదిలారు..…
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన.. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. ఆయా జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనేదానిపై ఆరా తీశారు.. ఇక, తన పర్యటనలో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం.. కోవిడ్ రోగులతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.. వారిలో భరోసా నింపుతూ ధైర్యాన్ని చెప్పారు..…
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసా గుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా కరోనాతో ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్ లాల్ బహుగుణ ఇవాళ మృతి చెందారు. కొన్ని…
కరోనా మహమ్మారి మొదటి దశలో ఉండగా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం పట్టేది. ఆ తరువాత వేగవంతంగా నిర్ధారణ చేసే కిట్ లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సమయం అగ్గిపోయింది. గంటల వ్యవధిలోనే ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఖచ్చితంగా నిర్ధారణ జరగాలి అంటే ఆర్టిపీసీఆర్ టెస్టులు చేయాలి. దీనికి ఎక్కువ ఖర్చు, సమయం పడుతుంది. దీంతో మిచిగాన్ కు చెందిన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన నిర్ధారణ వచ్చే కిట్లను తయారు చేశారు. లాలాజలంతో…
కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర అతలాకుతలం అయ్యింది. రెండు దశల్లో ఆ రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొన్నది. సెకండ్ వేవ్ సమయంలో ఆ రాష్ట్రం మరింతగా దెబ్బతిన్నది. ఏప్రిల్ 5 వ తేదీ నుంచి మహారాష్ట్రలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులపాటు నైట్ కర్ఫ్యూ, ఆ తరువాత ఉదయం కర్ఫ్యూ అమలు చేసిన సర్కార్, ఒక దశలో 144 సెక్షన్ కూడా అమలు చేసింది. కేసులు తగ్గకపోవడంతో లాక్ డౌన్ ను అమలు చేసింది. జూన్…
ఏపీలో కరోనా కేసులు విపాటితంగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కు నెల్లూరు జిలాల్లో కంట్లో మందు వైద్యం ఇస్తున్న అనందయ కు ప్రభుత్వము సహకరిస్తుంది అని కాకనని గోవర్ధన రెడ్డి అన్నారు. ఈ రోజు వైద్యం చేసి రెండు రోజులు అపి చేస్తాము. ఈ మందుకు సంబందించిన వనమూలికలు సమకూర్చుకోవడానికి సమయం పడుతుంది అని పేర్కొన్నారు. దీనికి అధికారికంగా త్వరలోనే అనుమతి వస్తుంది. ఇంతమంది వస్తారు అని మేము ఊహిచలేదు అని చెప్పిన…
రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా, లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 గంటల తరువాత ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. కరోనా, లాక్ డౌన్ ప్రభావం మెట్రో పై తీవ్రమైన ప్రభావం చూపింది. మొత్తం మూడు కారిడార్లలో మెట్రో రైళ్లునడుస్తున్నాయి. లాక్ డౌన్ కాలంలో ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో ఉండగా చివరి మెట్రో రైలు 8.45 గంటల అందుబాటులో ఉంది. దీంతో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పడిపోతూ వస్తున్నది. మే 12…