భారత్‌లో కరోనా ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ ఓ కుదుపు కుదిపేసింది.. కరోనాబారినపడినవారి సంఖ్య పెరగడమే కాదు.. కోవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక, కోవిడ్ బారినపడినవారి ఒళ్లు గుల్లైపోతోంది.. కరోనా నుంచి కోలుకున్నతర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా వారు ఐదారు నెలల పాటు కరోనా లక్షణాలతో సతమతమవుతున్నట్టుగా తెలుస్తోంది.. ఈ పరిస్థితికి వైద్య పరిభాషలో లాంగ్ కోవిడ్ అనే పేరు పెట్టారు. ఈ…
కరోనా రోజువారి కొత్త కేసుల నమోదు సంఖ్య తగ్గినా.. ఇంకా భారీగానే వెలుగు చూస్తుండడంతో.. మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. కరోనా కట్టడి కోసం విధించిన కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. మే 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఆంక్షలు.. ఇవాళ్టితో ముగియనుండగా.. మరో 10 రోజులు పాటు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 6 గంటల…
పరిస్థితి సీరియస్‌గా ఉన్న సమయంలో.. ఆనందయ్య మందు తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే కోలుకున్నట్టు మీడియాకు తెలిపిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఇక లేరు.. ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత వెంటనే నయం అయినట్టు అనిపించినా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో మళ్లీ ఆయన నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.. ఇదే సమయంలో.. ఆనందయ్య మందు వికటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే కథనాలు కూడా వచ్చాయి.. ఓ దశలో చనిపోయారనే ప్రచారం కూడా సాగింది.. కానీ, ఇంతకాలం ఆస్పత్రిలో…
తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు లాక్ డౌన్ కాలంలో మొదటి రైలు టెర్మినల్ స్టేషన్ నుంచి ఉదయం 7:00 గంటలకు బయలుదేరనుంది. చివరి రైలు ఉదయం 11:45 వరకే ఉంటుందని ప్రకటించారు.…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. ఐదు గంటల పాటు కొనసాగిన సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది. ఇక కోవిడ్ నిబంధనల సడలింపు నేపథ్యంలోనే ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల…
కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పటి వరకు దేశంలో 21 కోట్లమందికి వ్యాక్సిన్ అందించారు. మే నెలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం 7.9 కోట్ల డోసులను అందుబాటులో ఉంచగా, జూన్ నెలలో 12కోట్ల డోసులను అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో కేంద్రం 6.09 కోట్ల డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేయనుండగా, 5.86 కోట్ల డోసులు రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు సేకరించేందుకు…
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. అటు మరణాల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. కరోనా కేసులతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా దేశాన్ని భయపెడుతున్నాయి. రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతుండటం అంధోళన కలిగిస్తోంది. నార్త్ ఇండియాలోనే బ్లాక్ ఫంగస్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. హర్యానాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఆంధోళన కలిగిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో 650కి పైగా కేసులు నమోదవ్వగా, 50 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి. బ్లాక్…
కరోనా వేళ ప్రాణ వాయువు గురించి ప్రతిచోటా చర్చ జరుగుతున్నది. ఊపిరినిచ్చే ప్రాణవాయువు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సీజన్ కొరత కారణంగానే ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్లను పెంచడం వలన అవి కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని మనకు స్వచ్చమైన ప్రాణవాయువును అందిస్తుంటాయి. ఇంట్లో పెంచుకొనే కొన్నిరాకాల మొక్కలు మిగతావాటికంటే ఎక్కువ మొత్తంలో ప్రాణవాయువును అందిస్తుంటాయి. వీపింగ్ పిగ్, మనీ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, అరెకా ఫామ్, జెర్బారా డైసీ, స్నేక్ ప్లాంట్,…
తెలంగాణలో ఈనెల 12 నుంచి లాక్‌డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో లాక్ డౌన్ ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. కొద్ది సేపటి క్రితమే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి లాక్‌డౌన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ పొడిగింపుతో పాటుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో…