దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. అటు మరణాల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. కరోనా కేసులతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా దేశాన్ని భయపెడుతున్నాయి. రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతుండటం అంధోళన కలిగిస్తోంది. నార్త్ ఇండియాలోనే బ్లాక్ ఫంగస్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. హర్యానాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఆంధోళన కలిగిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో 650కి పైగా కేసులు నమోదవ్వగా, 50 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి. బ్లాక్ ఫంగస్, కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 15 వరకు స్కూల్స్ మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.