తెలంగాణలో ఈనెల 12 నుంచి లాక్‌డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో లాక్ డౌన్ ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. కొద్ది సేపటి క్రితమే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి లాక్‌డౌన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ పొడిగింపుతో పాటుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు,, అందుబాటులో ఉన్న బెడ్లపై కూడా చర్చించబోతున్నారు. ఆక్సీజన్ సరఫరా, బ్లాక్ ఫంగస్ చికిత్సపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.