తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు లాక్‌డౌన్ నుంచి వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు లాక్ డౌన్ కాలంలో మొదటి రైలు టెర్మినల్ స్టేషన్ నుంచి ఉదయం 7:00 గంటలకు బయలుదేరనుంది. చివరి రైలు ఉదయం 11:45 వరకే ఉంటుందని ప్రకటించారు. ఈ రైలు మధ్యాహ్నం 12:45 గంటల కల్లా సంబంధిత చివరి టెర్మినేషన్ స్టేషన్‌కు చేరుకుంటుంది. కాగా, ప్రతి ఒక్కరి భద్రత కోసం, ప్రయాణికులు సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, క్రమంగా హ్యాండ్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ వంటి కోవిడ్-19 భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని మెట్రో రైలు సంస్థ సూచించింది.